IPL 2022: వార్నర్ సెంచరీ కూడా చేయలేదు - కానీ ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటి - ఎందుకంటే?
డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటి. ఎందుకంటే?
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 58 బంతుల్లోనే 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మారింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ నిస్వార్థపూరితమైన వైఖరి దీనికి కారణం.
చివరి ఓవర్లో 8 పరుగులు చేస్తే తన సెంచరీ పూర్తవుతుంది. కానీ తనకు సింగిల్ తీసి ఇవ్వవద్దని, వీలైనంత గట్టిగా బంతిని కొట్టాలని స్ట్రైక్‌లో ఉన్న రొవ్‌మన్ పావెల్‌కు చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ వార్నర్‌కు ఒక్క బంతి కూడా లభించలేదు. రొవ్‌మన్ పావెల్ ఒక సిక్సర్, మూడు సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
చాలా మంది బ్యాటర్లు 90ల్లోకి వచ్చే దాకా ఎంతో వేగంగా ఆడి, ఆ తర్వాత సెంచరీ కోసం నిదానంగా ఆడిన సందర్భాలు ఎన్నో. అంతెందుకు ఒక బ్యాటర్ 90ల్లోకి వస్తే... తను సెంచరీ చేయాలని మనమే కోరుకుంటాం. 90ల్లో అవుటైతే నిరాశ పడతాం. కానీ తనే 90ల్లో ఉండి సెంచరీ అవసరం లేదు అన్నాడంటే వార్నర్ జట్టు ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.
అయితే దీంతోపాటు ఈ మ్యాచ్‌ను వార్నర్ పర్సనల్‌గా తీసుకున్నట్లు కనిపించింది. ఇన్నింగ్స్ ముగిసే దాకా క్రీజులో ఉండాలనే పట్టుదలతో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే కేవలం తను మాత్రమే హిట్టింగ్ చేయాలనే ఉద్దేశం కాకుండా రొవ్‌మన్ పావెల్ టచ్‌లో ఉన్నప్పుడు తనకు పూర్తిగా స్ట్రైక్ ఇచ్చాడు. దీనికోసం తన సెంచరీని కూడా త్యాగం చేశాడు.
View this post on Instagram