అన్వేషించండి

Danushka Gunathilaka : ధనుష్‌ గుణతిలకపై నిషేధం ఎత్తివేత , ప్రపంచకప్‌ బరిలో దిగుతాడా!

Danushka Gunathilaka: అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు గుణతిలకపై విధించిన నిషేధాన్నిఎత్తివేసింది.

శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ దనుష్క గుణతిలకపై విధించిన నిషేధాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదు అయింది. 29 ఏళ్ల మహిళ తనపై గుణతిలక అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదు అంతరం గుణతిలకను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సిసిర రత్నయ్య, నిరోషనా పెరెరా, న్యాయవాది అసేల రేకావా నేతృత్వంలోని విచారణ ప్యానెల్ గుణతిలకపై నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసుల మేరకు గుణతిలకపై నిషేధాన్ని ఎత్తివేస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో దాదాపు ఒక సంవత్సరం తర్వాత గుణతిలక మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగుమమైంది. 


 అక్టోబర్ 13న జరిగిన శ్రీలంక క్రికెట్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం తరువాత ధనుష్‌ గుణతిలకపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు క్రికెటర్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. దనుష్క గుణతిలకపై ఉన్న నేరారోపణలపై దర్యాప్తు కోసం నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ చేసిన సిఫారసుల మేరకు నిషేధం ఎత్తేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో దాఖలు చేసిన అన్ని అభియోగాల నుంచి గుణతిలక నిర్దోషిగా విడుదలయ్యారని గుర్తు చేసింది. 2022నవంబర్‌లో అతనిపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కమిటీ సిఫార్సు చేసిందని, ఆ సిఫారసుకు ఆమోదం తెలిపినట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. తిరిగి దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని స్పష్టం చేసింది.  గుణతిలకపై విధించిన సస్పెన్షన్ చట్టపరమైన చర్యల ఫలితం ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉందని, ఎందుకంటే క్రికెట్, దేశం ప్రతిష్టపై అతనిపై ముందే చర్యలు తీసుకున్నామని శ్రీలంక క్రికెట్‌ బోర్డు తెలిపింది. 


 టీ-20 వరల్డ్ కప్ కోసం గతేడాది ఆస్ట్రేలియా వెళ్లిన లంక జట్టులో గుణతిలక సభ్యుడిగా ఉన్నాడు. నవంబర్ 6న ధనుష్కను .. మహిళపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయం అయిన ఒక మహిళను లైంగిక కోరిక తీర్చాల్సిందిగా వేధించినట్లు తెలిసింది. లంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. అతడు లేకుండానే లంక టీమ్.. స్వదేశానికి పయనమైంది. అతడు ఇన్ని రోజులు సిడ్నీలో ఉండగా.. కోర్టు కూడా నిర్దోషిగా తేల్చింది. అక్టోబర్ 3నే లంకకు తిరిగి వచ్చాడు. 


 గుణతిలకపై ఇప్పుడు నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అతడి తిరిగి లంక జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. ప్రస్తుతం వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే ఆ స్థానంలో గుణతిలకను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. గుణతిలక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 8 టెస్టులు ఆడి 299 రన్స్ చేయగా.. 47 వన్డేల్లో 35.57 యావరేజ్‌తో 1601 పరుగులు చేశాడు. 46 టీ-20ల్లో 741 పరుగులు చేశాడు. అయితే గుణతిలక ఇప్పటికిప్పుడు ప్రపంచకప్‌ జట్టులో భాగం కాకపోవచ్చు. ఎవరైనా ఆటగాడు గాయపడితే ఆ స్థానంలో గుణతిలకను ఎంపిక చేసే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget