అన్వేషించండి

CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Andhra News: రాష్ట్రం దిశ దశను స్వర్ణాంధ్ర విజన్ 2047 మారుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పది సూత్రాలు.. ఒక విజన్ పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.

CM Chandrababu Released 2047 Vision Document: వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఏపీ సాకారమే లక్ష్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులు పాల్గొన్నారు. 'పది సూత్రాలు.. ఒక విజన్' పేరిట 'స్వర్ణాంధ్ర @ 2047' (Swarnandhra 2047) విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇది జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.

'సరికొత్త చరిత్రకు నాంది'

స్వర్ణాంధ్ర విజన్ 2047.. రాష్ట్ర దిశ, దశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 'డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలం.' అని పేర్కొన్నారు.

'ప్రతీ ఇంటి నుంచి పారిశ్రామికవేత్త..'

విజన్ 2047లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 'అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం.. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారుకావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. పీ4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరవు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ex MP Vijayasai Reddy: ఇండియా కూటమిలోకి వైఎస్ జగన్.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!
ఇండియా కూటమిలోకి వైఎస్ జగన్.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!
ED Notice To Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తాజాగా మరోసారి ఈడీ నోటీసులు.. ఈ 28న విచారణ
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈ 28న విచారణ
Nara Lokesh Meets Jay Shah: వాటర్ స్పోర్ట్స్ హబ్ గా ఏపీ- ఐసిసి అధ్యక్షుడు జై షా సహకారం కోరిన మంత్రి నారా లోకేష్
వాటర్ స్పోర్ట్స్ హబ్ గా ఏపీ- ఐసిసి అధ్యక్షుడు జై షా సహకారం కోరిన మంత్రి నారా లోకేష్
Vijayawada Landslide: భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah: బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Nara Lokesh News: ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
CEC Issue: సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసన
Balapur Ganesh Laddu Auction: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కామనర్స్ వర్సెస్ కామనర్స్! మొదటి రోజే పెద్ద గొడవ! కెప్టెన్ ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కామనర్స్ వర్సెస్ కామనర్స్! మొదటి రోజే పెద్ద గొడవ! కెప్టెన్ ముకేశ్!
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
టాటా టియాగో EV BAAS అంటే ఏంటి? తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు.. బ్యాటరీకి నెలనెలా చెల్లింపులు!
Tata Tiago EV కొనాలంటే బ్యాటరీకి భారీ ఖర్చు అక్కర్లేదు.. BAAS మోడల్ ఫుల్‌ డిటైల్స్‌
Romantic Horror Thriller OTT : ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget