అన్వేషించండి

Sri Lanka Cricket News: శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యత్వం సస్పెండ్ - ఐసీసీ భారీ షాక్!

Srilanka Cricket News: శ్రీలంక క్రికెట్ బోర్డు తమ వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ICC suspends Sri Lanka Cricket : అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) ఐసీసీ(ICC) బోర్డు శుక్రవారం (నవంబరు 10) శ్రీలంక క్రికెట్‌ బోర్డు(sri lanka cricket board) సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను ఉల్లంఘిస్తోందని ఐసీసీ బోర్డు (ICC )ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తమ వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ శ్రీలంక క్రికెట్ ICC సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేసింది. శ్రీలంకలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, కంట్రోలింగ్ అంతా ప్రభుత్వ జోక్యం ఉంది. సస్పెన్షన్ నిబంధనలను ఐసీసీ బోర్డు తగిన సమయంలో నిర్ణయిస్తుంది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రభుత్వం జోక్యం లేకుండా శ్రీలంకలో క్రికెట్ నిర్వహణ, క్రికెట్ నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించడంలో క్రికెట్ బోర్డు విఫలమైందని ఐసీసీ ఆరోపించింది. ఇప్పటికే వరల్డ్ కప్(World Cup 2023) లో శ్రీలంక జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ప్రపంచ కప్‌లో శ్రీలంక 9 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఏడు మ్యాచుల్లో శ్రీలంక ఓడిపోయింది.

వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన
ఈ పేలవ ప్రదర్శన కారణంగా శ్రీలంక బోర్డులో, శ్రీలంకలో గందరగోళం ఏర్పడింది. దీంతో శ్రీలంక క్రికెట్ గవర్నింగ్ బాడీని రద్దు చేస్తూ శ్రీలంక పార్లమెంట్ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. శ్రీలంక క్రికెట్ జట్టు శుక్రవారం ఉదయం భారత్ నుంచి తిరిగి వెళ్లింది. బెంగళూరులో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలవగలిగింది. దీంతో ఇది ఇప్పటివరకు వారి అత్యంత పేలవ ప్రదర్శన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్‌పై శ్రీలంక జట్టు 56 పరుగులకే ఆలౌట్ అయింది.

సోమవారం అంతకుముందు, క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ శ్రీలంక క్రికెట్ బాడీని తొలగించి, క్రికెట్ బోర్డును నడపడానికి ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీకి మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగను చీఫ్ గా నియమించారు. అయితే, కోర్టులో అప్పీల్ తర్వాత, షమ్మీ సిల్వా నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం తిరిగి నియమించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, ప్రతిపక్షాలు గురువారం పార్లమెంట్‌లో ఉమ్మడి తీర్మానాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐసీసీ అండర్ 19 పురుషుల వరల్డ్ కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజాగా క్రికెట్ బోర్డునే రద్దు చేయడం వల్ల మరి అండర్‌ -19 ప్రపంచ కప్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది.

Also Read: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కూ హార్దిక్‌ పాండ్య దూరం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget