అన్వేషించండి

Cricketer Cap History: క్రికెట్ క్యాప్ వెనుక దాగున్న రహస్యాలివే! మీ అభిమాన ఆటగాడి నంబర్ ఏంటో తెలుసా?

Cricket News | 1877లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లోనే క్రికెటర్ల క్యాప్స్ కు నంబర్స్ ఇవ్వడం అనే ఈ సంప్రదాయం పురుడుపోసుకుంది.

Cricketer Caps History: క్రికెటర్లకు క్యాప్ ఎండ నుండి కాపాడే ఓ సాధారణ క్యాప్ కాదు. క్రికెటర్లు పెట్టుకునే క్యాప్ ఆ ఆటగాడికి ఇచ్చే గౌరవం. దానికో నంబర్ ఉంటుంది. అది ఆ ఆటగాడి అరంగేట్రానికి ఇచ్చే ఘనత, గొప్ప స్వాగతం. ఆ క్యాప్‌కు ఇచ్చే నెంబర్ జట్టులో అతని స్థానాన్ని, ఎంతో మంది లెజెండరీ క్రికెటర్ల వారసుడిగా జట్టులోకి రావడాన్ని సూచిస్తుంది. అసలు క్యాప్‌కు నెంబర్లు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఈ సంప్రదాయ చరిత్ర ఏంటో పూర్తి కథనం చదివి తెలుసుకోండి.

క్రికెట్ సంప్రదాయాల్లో భాగంగా పుట్టిందే క్రికెటర్ క్యాప్స్‌కు నంబరింగ్.

క్రికెటర్లు గ్రౌండ్‌లో ధరించే క్యాప్‌లకు నంబర్లు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ పుట్టుకతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. 1877లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లోనే ఈ సంప్రదాయం పురుడుపోసుకుంది. ఒక దేశం తరపున జట్టులో చేరే ప్రతీ క్రికెటర్‌ను, అతని అరంగేట్రాన్ని గౌరవించాలన్న ఆలోచనతోనే ఈ సంప్రదాయం ప్రారంభం అయింది. తను ధరించే క్యాప్ నెంబర్ ఆ జట్టులో అతని స్థానాన్ని సూచిస్తుంది. అతనికి ఇచ్చిన నంబర్ మరో ఆటగాడికి ఇవ్వడం ఉండదు. అంటే జీవితకాలం అతను ఆడిన జట్టులో అతని నంబర్, అతని స్థానాన్ని, అతని సేవలను గుర్తు చేస్తూ ఉంటుంది.

భారత టెస్ట్ క్రికెట్‌లో తొలి క్యాప్ ఎవరు అందుకున్నారో తెలుసా?

క్రికెట్‌లో భారత్ కూడా టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో క్రికెట్ ప్రయాణం ఆరంభించింది. 1932లో ఇండియా తన తొలి టెస్ట్‌ను ఇంగ్లండ్‌తో ఆడింది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు సి. కే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ జట్టులో తొలి క్యాప్ అందుకున్నది మాత్రం అమర్ సింగ్. ఇతను ఇండియన్ తొలి ఫాస్ట్ బౌలర్‌గా పేరుపొందారు. కేవలం బౌలర్‌గానే కాదు, దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా పేరుంది. ఇక వన్డే క్రికెట్ విషయానికి వస్తే మన దేశం 1974లో తొలి వన్డేను అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఆడింది. ఇంగ్లండ్‌లోని హెడింగ్లే మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలి వన్డే క్యాప్ దక్కించుకుంది మాత్రం సుధీర్ నాయక్. ఇతను రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, దేశీయ క్రికెట్‌లో అతను ముంబై జట్టు కెప్టెన్ కూడా. ఇక టీ20 క్రికెట్‌లో కూడా నంబర్ల విధానం ప్రారంభం అయింది. తొలి టీ20 మ్యాచ్‌ను 2006లో దక్షిణాఫ్రికాతో ఆడింది. ఇందులో తొలి టీ20 క్యాప్‌ను అజిత్ అగార్కర్ దక్కించుకున్నారు.

ప్రముఖ క్రికెటర్ల టెస్ట్ క్యాప్ నంబర్లు ఇవే:

అమర్ సింగ్: 1

సునీల్ గవాస్కర్: 129

కపిల్ దేవ్: 155

సచిన్ టెండూల్కర్: 187

రాహుల్ ద్రావిడ్: 207

ఎం.ఎస్. ధోని: 251

విరాట్ కోహ్లి: 269

రోహిత్ శర్మ: 280

చివరిగా అందుకున్నది (అన్షుల్ కంబోజ్): 318

ప్రముఖ వన్డే క్రికెటర్ల క్యాప్ నంబర్లు ఇవే:

సుధీర్ నాయక్: 1

సునీల్ గవాస్కర్: 4

కపిల్ దేవ్: 25

సౌరవ్ గంగూలీ: 84

రాహుల్ ద్రావిడ్: 86

సచిన్ టెండూల్కర్: 74

ఎం.ఎస్. ధోని: 159

రోహిత్ శర్మ: 168

విరాట్ కోహ్లి: 175

చివరిగా అందుకున్నది (తిలక్ వర్మ): 261

టీ20 స్టార్ క్రికెటర్ల క్యాప్ నంబర్స్:

సచిన్ టెండూల్కర్: 11

వీరేంద్ర సెహ్వాగ్: 34

రోహిత్ శర్మ: 35

ఎం.ఎస్. ధోని: 36

యువరాజ్ సింగ్: 38

విరాట్ కోహ్లి: 44

చివరి టీ20 క్రికెట్ క్యాప్ అందుకున్నది అభిషేక్ శర్మ: 125

అయితే క్యాప్స్‌తో పాటు ఆటగాళ్లు ధరించే జెర్సీలకు నంబర్ ఉంటుంది. అయితే ఈ జెర్సీ నంబర్‌ను ఆటగాడు తన ఇష్టాన్ని, పుట్టిన తేదీ, అదృష్ట సంఖ్య ఆధారంగా ఎంచుకోవచ్చు. కానీ క్యాప్ నెంబర్ మాత్రం అలా కాదు. ఏ దేశ జట్టుకు ఆడితే, ఆ క్రికెట్ బోర్డు క్రమ పద్ధతిలో ఆ సంఖ్యను ఇస్తుంది. ఆ సంఖ్య మరో ఆటగాడికి ఇవ్వడం అనేది జరగదు. ఇలా క్రికెట్ ఆడే దేశాలలోని క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్ల క్యాప్స్‌కు నంబర్స్ ఇస్తూ, వారి అరంగేట్రాన్ని గౌరవించడం క్రికెట్ సంప్రదాయంగా మారింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget