Gautam Gambhir: 12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం
Ind vs Nz 3rd Test | స్వదేశంలో భారత్ చాలాకాలం తరువాత టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వరుస రెండు టెస్టుల్లో ఓడటంతో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
coach Gautam Gambhirs Strict action After Test series Loss | IND vs NZ | భారత గడ్డపై సిరీస్ అంటే.. అందులోనూ టెస్ట్ సిరీస్ అంటే దాదాపు అన్ని పెద్ద జట్లూ కాస్త భయంతో వచ్చేవి. ఎందుకంటే సొంతగడ్డపై గత దశాబ్దం నుంచి భారత్ కు అలాంటి ట్రాక్ రికార్డులు ఉన్నాయి. కానీ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. స్వదేశంలో బలమైన జట్టుగా ఉన్న టీమిండియా టెస్టులను కనీసం డ్రా చేసుకోలేని పరిస్థితి. అందులోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఓడిపోవడం అటు బీసీసీఐ పెద్దలను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది.
12 ఏళ్ల తరువాత సొంతగడ్డమపై భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో మరో టెస్టు ఉండగానే 2-0 ఓటమితో దారుణంగా విఫలమైంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కు ఇది ఊహించని ఫలితమనే చెప్పాలి. ఆట పట్ల సీరియస్ గా ఉండే గంభీర్ కోచ్ గానూ అలాగే ఉండాలని భావిస్తాడు. కానీ కివీస్ చేతిలో టెస్టు సిరీస్ వైఫల్యంతో సీనియర్ ఆటగాళ్లకు కోచ్ గంభీర్ షాకిచ్చాడు. వారికి ఉన్న ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం మూడో టెస్టులోనైనా భారత్ నెగ్గి ఓటమి అంతరాన్ని తగ్గించాలని, లేకపోతే పరిస్థితి మరీ చేయి దాటి పోతుందని హెడ్ కోచ్ గంభీర్ ఆలోచన. నవంబర్ 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.
టెస్ట్ సిరీస్ ఓటమితో గంభీర్ కీలక నిర్ణయం
స్వదేశంలో టెస్టులు నెగ్గకపోయినా.. ప్రత్యర్థిని మాత్రం ముప్పుతిప్పలు పెట్టి మ్యాచ్ లు డ్రా చేసుకునేది భారత్. గత దశాబ్దం నుంచి విజయాలే ఎక్కువ. కానీ కివీస్ తో టెస్టు సిరీస్ ఓటమితో గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లకు ఉన్న ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. సిరీస్ ప్రారంభానికి ముందు జట్లు ప్రాక్టీస్ చేస్తుంటాయి. వీటిలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్, స్టార్ ఆటగాళ్లకు ఈ ట్రైనింగ్ సెషన్ నుంచి మినహాయింపు ఉండేది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ వాళ్లు గాయపడితే అసలుసిసలైన పోరులో జట్టుకు నష్టం జరుగుతుందని బీసీసీఐ పెద్దల అభిప్రాయం. ఆ సమయంలో ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లు వ్యక్తిగత పనులు ఉంటే చూసుకునేవారు. కానీ తాజా ఓటమితో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ సెషన్ కు తప్పనిసరిగా హాజరు కావాలని టీమ్ మేనేజ్ మెంట్ తేల్చేసింది.
అక్టోబర్ 30, 31 తేదీలలో దీపావళి సమయంలో రెండు రోజులపాటు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ కు హాజరు కావాలని గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని వాంఖండేలో నవంబర్ ఒకటో తేదీన చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందులోనైనా గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగు చేసుకోవాలని భారత కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. దాంతో ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం.
Also Read: IND Vs NZ 2nd Test: 12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!