2023 ODI World Cup: 2023 ప్రపంచకప్‌లో అనూహ్యంగా రాణించిన టాప్-10 ప్లేయర్లు వీరే - ఏ అంచనాలు లేకుండా?
2023 వన్డే వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా రాణించిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు.
![2023 ODI World Cup: 2023 ప్రపంచకప్‌లో అనూహ్యంగా రాణించిన టాప్-10 ప్లేయర్లు వీరే - ఏ అంచనాలు లేకుండా? Check Out Top 10 Players in 2023 ODI World Cup Who Surprised With Their Performance 2023 ODI World Cup: 2023 ప్రపంచకప్‌లో అనూహ్యంగా రాణించిన టాప్-10 ప్లేయర్లు వీరే - ఏ అంచనాలు లేకుండా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/c57c01aea11075dcd46d8668c102ccb31694771563342127_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఇప్పటివరకు చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ టోర్నీలో బంతికి, బ్యాట్‌కి మధ్య హోరాహోరీ పోరు సాగింది. అనుభవజ్ఞుల నుంచి యువ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటగాళ్లు టోర్నీలో తమదైన ముద్ర వేశారు. అయితే తమ ఆటతీరుతో టోర్నీని మెరుగుపరిచిన 10 మంది ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. క్వింటన్ డి కాక్
తన చివరి ప్రపంచకప్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఇప్పటివరకు చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. టోర్నమెంట్‌లో డి కాక్ ఇప్పటివరకు మూడు సెంచరీలు సాధించాడు. దీంతో అతను ప్రస్తుతం 2023 ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 431 పరుగులు చేశాడు.
2. మహ్మద్ షమీ
అనుభవజ్ఞుడైన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రపంచ కప్ 2023లో ప్రవేశించిన వెంటనే సంచలనం సృష్టించాడు. అతను టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. తన రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ రెండు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు.
3. డేవిడ్ వార్నర్
అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టోర్నీలో ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 163 పరుగులుగా ఉంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో డేవిడ్ వార్నర్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో 413 పరుగులు చేశాడు.
4. ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. తలకు గాయం కావడంతో క్రికెట్‌కు దూరంగా ఉన్న హెడ్ తిరిగి వచ్చిన వెంటనే తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌పై ట్రావిస్ హెడ్ 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
5. హెన్రిచ్ క్లాసెన్
ఇప్పటివరకు జరిగిన టోర్నీలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శన చేశాడు. క్లాసెన్ ఆరు ఇన్నింగ్స్‌లలో 300 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. అతను ఒక సెంచరీని కూడా సాధించాడు.
6. స్కాట్ ఎడ్వర్డ్స్
ఇప్పటివరకు జరిగిన టోర్నీలో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. ఇప్పటివరకు అతను ఆరు మ్యాచ్‌లలో 2 అర్ధ సెంచరీలతో సహా ఆరు ఇన్నింగ్స్‌లలో 204 పరుగులు చేశాడు.
7. పతుం నిశ్శంక
2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధికంగా నాలుగు అర్ధసెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శ్రీలంక ఆటగాడు పతుం నిశ్శంక నిలిచాడు. అదే సమయంలో అతను ఆరు మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు చేశాడు.
8. అబ్దుల్లా షఫీక్
ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన పాకిస్థాన్ యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీ (113) చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో షఫీక్ 14వ స్థానంలో ఉన్నాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సాయంతో 264 పరుగులు చేశాడు.
9. రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర తొలి ప్రపంచకప్‌లోనే అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 123 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు రెండు సెంచరీలతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 406 పరుగులు చేశాడు.
10. మార్కో జాన్సెన్
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ బంతితో పాటు బ్యాట్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాన్సెన్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. బ్యాట్‌తో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 12*, 26, 09, 75*, 1*, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)