2023 వన్డే వరల్డ్ కప్‌లో టాప్-10 రికార్డులు ఇవే - టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?
భారత్‌తో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి.
ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని జట్లు ఒక్కొక్కటి మూడు మ్యాచ్‌లు ఆడగా, కొన్ని ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. ఈ 13 మ్యాచ్‌ల తర్వాత ఈ టోర్నీలో పరుగుల పరంగా పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆధిక్యంలో ఉన్నాడు. అదే సమయంలో వికెట్లు తీయడంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముందున్నారు.
ఈ ప్రపంచ కప్‌లో టాప్-10 స్టాట్స్
1. అత్యధిక పరుగులు: మహ్మద్ రిజ్వాన్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 248 పరుగులు చేశాడు. అతని తర్వాత డెవాన్ కాన్వే (229) రెండో స్తానంలో, రోహిత్ శర్మ (217) మూడో స్థానంలో ఉన్నారు.
2. అత్యధిక వికెట్లు: జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ ప్లేస్‌లో అతనితో పాటు మిచెల్ సాంట్నర్ (8), మాట్ హెన్రీ (8) కూడా ఉన్నారు.
3. అత్యధిక వ్యక్తిగత స్కోరు: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే ఆడిన 147 బంతుల్లో 152 పరుగుల ఇన్నింగ్స్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
4. అత్యధిక సగటు: కివీ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను మూడు మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌లలో 137 పరుగులు చేశాడు, ఒకసారి నాటౌట్‌గా ఉన్నాడు. అంటే అతని బ్యాటింగ్ సగటు కూడా 137గా ఉంది.
5. అత్యధిక స్ట్రైక్ రేట్: ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 119 బంతుల్లో 198 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 166.38.
6. అత్యధిక సిక్సర్లు: ఈ రికార్డు కూడా కుశాల్ మెండిస్ పేరిట ఉంది. ఇప్పటి వరకు 14 సిక్సర్లు కొట్టాడు.
7. బెస్ట్ బౌలింగ్ : కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ నెదర్లాండ్స్‌పై 10 ఓవర్లలో 59 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
8. బెస్ట్ ఎకానమీ రేట్: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ప్రపంచకప్‌లో 10 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని ఎకానమీ రేటు కేవలం 3.4 మాత్రమే.
9. అత్యుత్తమ బౌలింగ్ సగటు: ఈ ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ సగటు 11.62. అంటే ప్రతి 12 పరుగులకు ఒక్కో వికెట్ లభించిందన్న మాట.
10. టాప్ బౌలింగ్ స్ట్రైక్ రేట్: బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ 8 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంటే ప్రతి 12 బంతుల్లో ఒక వికెట్ తీశాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial