News
News
X

Ben Stokes: ఓటమిని మోయడం చాలా కష్టం - ఫైనల్ అనంతరం బెన్ స్టోక్స్!

ఓటమిని మోయడం చాలా కష్టమని ఫైనల్ విజయం అనంతరం బెన్ స్టోక్స్ అన్నాడు.

FOLLOW US: 
 
ఐర్లాండ్‌తో జరిగిన షాక్ ఓటమి బాధించినప్పటికీ, ఆటగాళ్ళు ఆ షాక్ నుంచి త్వరగా తేరుకుని ముందుకు వెళ్లే మార్గంపై దృష్టి సారించారని పాకిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఆదివారం మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌కి రెండో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించటానికి స్టోక్స్ తన చాలా కష్టపడ్డాడు. "అది (ఐర్లాండ్‌తో ఓటమి) పోటీలో చాలా ముందుగానే జరిగింది." అని 2019 ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించిన స్టోక్స్ చెప్పాడు.

"ఇలాంటి టోర్నమెంట్‌లలో మీరు మీతో ఓటమిని మోస్తూ తీసుకువెళ్లలేరు. అది చాలా కష్టం. మమ్మల్ని ఓడించడం ఐర్లాండ్‌ ఘనత. కానీ అత్యుత్తమ జట్లు తమ తప్పుల నుండి నేర్చుకుంటాయి. వాటి ప్రభావాన్ని తమ మీద పడనివ్వవు" అని స్టోక్స్ అన్నాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో వైట్-బాల్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను, పరిమిత ఓవర్ క్రికెట్‌లో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన అతని జట్టును అందరూ ప్రశంసించారు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలవడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో గర్వంగా ఉందని బట్లర్ అన్నాడు.

"ఇది ఒక అద్భుతమైన టోర్నమెంట్. మేము ఇక్కడికి రాకముందు పాకిస్తాన్‌కి వెళ్లాము. ఐర్లాండ్ మ్యాచ్ తర్వాత టోర్నీలో ముందుకు వెళ్లడం చాలా కష్టం అనిపించింది. కానీ తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లలో మేం చూపించిన పాత్ర అద్భుతమైనది. ఈ టోర్నమెంట్‌లో మాతో పాటు కోచింగ్ స్టాఫ్‌లో కొంతమంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు. కోచ్ మ్యాటీ మోట్స్ కోచింగ్ సిబ్బందిని బాగా నడిపించాడు. ఆటగాళ్లకు గొప్ప స్వేచ్ఛను ఇచ్చాడు." అని బట్లర్ తెలిపాడు. శామ్ కరన్‌తో పాటు ఫైనల్‌తో సహా టోర్నమెంట్ అంతటా మిడిల్ ఓవర్లలో వికెట్లను అందించిన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా బట్లర్ ప్రశంసించాడు.

News Reels

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

Published at : 13 Nov 2022 11:40 PM (IST) Tags: Ben Stokes T20 Worldcup 2022 T20 WC 2022 ENG Vs PAK

సంబంధిత కథనాలు

Deepak Chahar: భోజనం పెట్టలేదు, లగేజ్ ఇవ్వలేదు-  మేం ఎలా ఆడాలి:  దీపక్ చాహర్

Deepak Chahar: భోజనం పెట్టలేదు, లగేజ్ ఇవ్వలేదు- మేం ఎలా ఆడాలి: దీపక్ చాహర్

సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ - అలా చేస్తే గడ్డుకాలమే!

సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ - అలా చేస్తే గడ్డుకాలమే!

Rohit Sharma: బంగ్లా టైగర్స్‌పై గెలుపు సులువేం కాదు - ఆఖరి వరకు భయపెడతారన్న రోహిత్‌

Rohit Sharma: బంగ్లా టైగర్స్‌పై గెలుపు సులువేం కాదు - ఆఖరి వరకు భయపెడతారన్న రోహిత్‌

Virender Sehwag: టీ20లు మాత్రమే కాదు- వన్డేలు, టెస్టులు కూడా ఆ పని చేయగలవు: సెహ్వాగ్

Virender Sehwag: టీ20లు మాత్రమే కాదు- వన్డేలు, టెస్టులు కూడా ఆ పని చేయగలవు: సెహ్వాగ్

IND vs BAN 1st ODI: రేపే భారత్- బంగ్లా తొలి వన్డే- సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో బరిలోకి భారత్!

IND vs BAN 1st ODI: రేపే భారత్- బంగ్లా తొలి వన్డే- సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో బరిలోకి భారత్!

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?