అన్వేషించండి

Asia Cup 2025 Ban Vs Afg Result Update: బంగ్లా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. రెండో విజ‌యంతో సూప‌ర్-4పై ఆశ‌లు.. పోరాడి ఓడిన ఆఫ్గాన్.. రాణించిన తంజిద్, ముస్తాఫిజుర్, గుర్బాజ్

డూ ఆర్ డై మ్యాచ్ లో బంగ్లా విజృంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించి, టోర్నీలో 2వ‌ విజ‌యాన్ని సాధించింది.ఇక ఈ గ్రూపులో సూప‌ర్-4 పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆఖ‌రి మ్యాచ్ త‌ర్వాత దీనిపై తేలుతుంది.

Asia Cup 2025 Ban Gets 2nd Victory : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ సత్తా చాటింది. మంగళవారం అబుధాబిలో ఆఫ్గానిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో 8 ప‌రుగుల‌తో ఉత్కంఠభరిత విజ‌యం సాధించింది. దీంతో లీగ్ ద‌శ‌లో రెండు విజ‌యాలు సాధించిన బంగ్లా.. సూప‌ర్-4పై ఆశ‌లు పెట్టుకుంది. అంత‌కుముందు టాస్ నెగ్గి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 154 ప‌రుగులు చేసింది. వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న ఓపెన‌ర్ తంజిద్ హ‌స‌న్ సూప‌ర్బ్ ఫిఫ్టీ (31 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్, నూర్ అహ్మ‌ద్ ల‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఓ మాదిరి ఛేజింగ్ తో బ‌రిలోకి దిగిన ఆఫ్గాన్.. ఓవ‌ర్ల‌న్నీ ఆడి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 8 ప‌రుగుల స్వ‌ల్ప తేడాతో ప‌రాజ‌యం పాలైంది.  ఓపెన‌ర్ ర‌హ్మానుల్లా గుర్బాజ్ (31 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ ర‌హ్మ‌న్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఈ విజ‌యంతో నాలుగు పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. సూప‌ర్-4 ద‌శ‌కు చేరే జ‌ట్ల వివ‌రాలు తెలియాలంటే శ్రీ‌లంక‌, ఆఫ్గాన్ ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ వ‌ర‌కు ఆగ‌క త‌ప్పదు. ఈ మ్యాచ్ లో లంక గెలిస్తే, లంక‌తోపాటు బంగ్లా సూప‌ర్-4కు చేర‌తాయి. ఒక‌వేళ ఆఫ్గాన్ గెలిచినా చాలు, లంక‌తోపాటు ఆ జ‌ట్టు కూడా త‌ర్వాతి ద‌శ‌కు అర్హ‌త సాధిస్తుంది. అయితే ఒడినా, భారీ తేడాతో మాత్రం లంక ఒడిపోకూడ‌దు. ఎందుకంటే నెట్ ర‌న్ రేట్ దిగ‌జారితే, మూడో స్థానానికి ఆ జ‌ట్టు ప‌డిపోయి, ఎలిమినేట్ అయ్యే అవ‌కాశ‌ముంది. ఈ మ్యాచ్ గురువారం ఇదే వేదిక‌పై జ‌రుగుతుంది. 

సూప‌ర్ ఓపెనింగ్.. 
లంక‌తో గ‌త మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఓడిపోయిన బంగ్లా ఈ మ్యాచ్ లో స‌త్తా చాటింది. ముఖ్యంగా ఓపెన‌ర్లు సైఫ్ హ‌స‌న్ (30), తంజిద్ ఆక‌ట్టుకున్నారు. వీరిద్ద‌రూ ఆరంభం నుంచే ఆఫ్గాన్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేశారు. తొలి వికెట్ కు 63 ప‌రుగులు జోడించిన త‌ర్వాత హ‌స‌న్ ఔట‌య్యాడు. ఈ ద‌శ‌లో కెప్టెన్ లిట‌న్ దాస్ (9) కూడా త్వ‌ర‌గానే వెనుదిరిగినా, తౌహిద్ హృద‌య్ (26) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అంత‌కుముందు 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని తంజిద్ ఔట‌య్యాడు. అయితే చివ‌ర్లో కాస్త వేగంగా బంగ్లా బ్యాట‌ర్లు ఆడ‌లేక పోవ‌డంతో అనుకున్న‌దాని కంటే కాస్త త‌క్కువ స్కోరుకే ఆ జ‌ట్టు ప‌రిమిత‌మైంది.

థ్రిల్లింగ్ విక్ట‌రీ..
ఓ మాదిరి టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆఫ్గాన్ కు శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్ సాదికుల్లా అట‌ల్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (5) కూడా విఫ‌లం కావ‌డంతో ఆఫ్గాన్ ఒత్తిడిలో పడిపోయింది. అయినా కూడా గుర్బాజ్ కాస్త వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌నికి మిగ‌తా వారి నుంచి స‌హాకారం ద‌క్క‌లేదు. వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతుండ‌టంతో గెలుపు దిశ‌గా ఆఫ్గాన్ ప‌య‌నించ‌లేదు. చివ‌ర్లో అజ్మ‌తుల్ల ఒమ‌ర్ జాయ్ (30), కెప్టెన్ ర‌షీద్ ఖాన్ (20), నూర్ అహ్మ‌ద్ (14) బ్యాట్ ఝుళిపించి, ఆశ‌లు రెకేత్తించినా, విన్నింగ్ లైన్ దాట‌డానికి స‌రిపోలేదు. దీంతో ఆఫ్గాన్ ప‌రాజ‌యం పాలు కాక త‌ప్ప‌లేదు. మిగ‌తా బౌల‌ర్ల‌లో న‌సుమ్ అహ్మ‌ద్, త‌స్కిన్ అహ్మ‌ద్, రిషాద్ హుస్సేన్ ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన బంగ్లా ర‌న్ రేట్ మైన‌స్ లోనే ఉంది. దీంతో చివ‌రి మ్యాచ్ లో లంక‌పై ఆఫ్గాన్ గెలిస్తే, బంగ్లా టోర్నీ నుంచి నాకౌట్ అవుతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Harsh Dubey Replaces Washington: ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget