అన్వేషించండి

INDW vs AUSW 4th T20: కీలక మ్యాచ్ లో పోరాడి ఓడిన భారత అమ్మాయిలు- సిరీస్ ఆసీస్ కైవసం

INDW vs AUSW 4th T20: ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. శనివారం ముంబయిలోని బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 7 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది.

INDW vs AUSW 4th T20:  ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. శనివారం ముంబయిలోని బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 7 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. 

తేలిపోయిన బౌలర్లు

మొదట టాస్ గెలిచిన భారత్, ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఆసీస్ ఓపెనర్లు వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడారు. మూనీ క్రీజులో ఇబ్బందిగా కదిలినప్పటికీ, హేలీ వేగంగా పరుగులు చేసింది. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద మూనీ (3) ఔటయ్యింది. రెండో వికెట్ ను భారత బౌలర్లు త్వరగానే పడగొట్టారు. 6.5 ఓవర్లలో 46 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గార్డెనర్ (27 బంతుల్లో 42), పెర్రీ (42 బంతుల్లో 72) లు విజృంభించి ఆడారు. వీరిద్దరూ భారీ షాట్లతో భారత బౌలర్లను చిత్తు చేశారు. తర్వాత గార్డెనర్ ఔటైనా.. హరిస్ తో కలిసి (12 బంతుల్లో 27) కలిసి పెర్రీ తన జట్టుకు 188 పరుగుల భారీ స్కోరును అందించింది. 

బ్యాటర్ల తడబాటు

189 పరుగుల భారీ విజయ లక్ష్యంతో ఇన్నింగ్సును ఆరంభించిన భారత్ కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన (10 బంతుల్లో 16) కొన్ని షాట్లు కొట్టినప్పటికీ త్వరగా ఔటయ్యింది. ఆ తర్వాత షెఫాలీ వర్మ (16 బంతుల్లో 20), జెమీమా రోడ్రిగ్స్ (11 బంతుల్లో 8) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 46), దేవికా వైద్య (26 బంతుల్లో 32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో హర్మన్, దేవికా వెనుదిరగటంతో లక్ష్యఛేదన కష్టమైంది. అయినప్పటికీ ఆఖర్లో రిచా ఘోష్ (19 బంతుల్లో 40), దీప్తి శర్మలు (8 బంతుల్లో 12) విజయం కోసం అద్భుతంగా పోరాడారు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో భారత్ విజయానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. 

ఆస్ట్రేలియా విజయంతో భారత్ సిరీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఇంక ఈ సిరీస్ లో నామమాత్రమైన ఐదో వన్డే మంగళవారం జరగనుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget