అన్వేషించండి
AUS vs NZ: ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరు, న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా అమీతుమీ
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో వరుస విజయాలతో మళ్లీ గాడినపడిన ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో వరుస విజయాలతో మళ్లీ గాడినపడిన ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్‌పై గెలిచి తమ విజయాల జోరును కొనసాగించాలని కంగారులు పట్టుదలగా ఉన్నారు. బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంతో ఆసిస్ విజయంపై ధీమాగా ఉంది. కానీ ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క ఓటమితో న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఈ రెండు జట్ల మధ్య భీకర పోరు ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ మహా సంగ్రామంలో పేలవ ఆరంభం నుంచి పుంజుకున్న ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. భారత్, దక్షిణాఫ్రికాపై ఓటముల తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన కంగారులు వరుసగా మూడు విజయాలతో మళ్లీ గాడిన పడ్డారు. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 309 పరుగులతో ఓడించి ప్రత్యర్థులకు కంగారు జట్టు గట్టి హెచ్చరికలు పంపింది. టోర్నమెంట్‌లో కీలక దశలో ఐదుసార్లు ప్రపంచకప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ చేరే నాలుగు జట్లలో ఒకటిగా నిలవాలని కమ్మిన్స్ నేతృత్వంలోని కంగారులు పట్టుదలగా ఉన్నారు.
ఆసిస్ బ్యాటర్లు నిలిస్తే....
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా.... ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ కప్‌లలో ఇప్పటివరకు ఆసిస్-ప్రొటీస్ 11 మ్యాచ్‌ల్లో తలపడగా ఆస్ట్రేలియా ఎనిమిది విజయాలు సాధించగా న్యూజిలాండ్ కేవలం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. మొత్తం 141 వన్డేల్లో ఈ రెండు జట్లు తలపడగా... 95 వన్డేల్లో కంగారులు... 39 వన్డేల్లో కివీస్ విజయం సాధించాయి. ఆరేళ్ల క్రితం 2017లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చివరి వన్డే విజయం సాధించడం గమానార్హం. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసి బ్యాటింగ్‌లో దుర్భేద్యంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా 34వ ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 259 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (332 పరుగులు) వరుసగా రెండు సెంచరీలు చేసి ఈ ప్రపంచకప్‌లో టాప్ రన్‌స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ కొంచెం ఆందోళనకరంగా ఉంది. స్టీవ్ స్మిత్, లబుషేన్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రపంచకప్ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్ యొక్క వేగవంతమైన సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి రావడం కంగారులు కలిసి రానుంది. కానీ కెమరూన్ గ్రీన్ ఫామ్ ఆసిస్‌ను ఆందోళన పరుస్తోంది. మిచెల్ స్టార్క్ (7 వికెట్లు), జోష్ హేజిల్‌వుడ్ (6 వికెట్లు), కమిన్స్ (6 వికెట్లు) బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. ఆడమ్ జంపా అద్భుతంగా రాణిస్తుండడం ఆస్ట్రేలియాకు బలంగా మారింది.
పటిష్టంగా న్యూజిలాండ్
న్యూజిలాండ్ ఈ ప్రపంచకప్‌లోనూ పటిష్టంగా ఉంది. టీమిండియాపై తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. డెవాన్ కాన్వే (249 పరుగులు) నుంచి కివీస్ మరో భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ (268 పరుగులు), రచిన్ రవీంద్ర (290 పరుగులు) బాధ్యతలను పంచుకోవలసి ఉంది. విలియమ్సన్ గైర్హాజరీలో, వికెట్ కీపర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మిచెల్ శాంట్నర్ (12) వికెట్లతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటుతున్నాడు. పేసర్లు మాట్ హెన్రీ (10 వికెట్లు), లాకీ ఫెర్గూసన్ (8 వికెట్లు) ఇప్పటివరకు ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ కూడా రాణిస్తే కంగారులకు తిప్పలు తప్పవు.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
న్యూజిలాండ్ జట్టు: ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
సినిమా
ట్రెండింగ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion