అన్వేషించండి
Advertisement
AUS vs SL: ఆచితూచి ఆడుతున్న లంక, ఆరు ఓవర్లకు 35/0
ODI World Cup 2023: నేడు ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. వరల్డ్ కప్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు సార్లు ట్రోఫీ కొట్టిన ఆస్ట్రేలియా ఇప్పుడు బోణీ కొట్టేందుకు నానా తంటాలు పడుతోంది.
ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడుతున్నాయి. ప్రపంచకప్ 14వ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. లక్నోలో ఏకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. లంక ఓపెనర్లు నిస్సంక, కుశాల్ పెరీరా రక్షణాత్మకంగా ఆడుతుండడంతో స్కోరు బోర్డు నిదానంగా కదులుతోంది. కంగారు బౌలర్లు మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాట్స్‌మెన్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. నిస్సంక 18 బంతుల్లో 18 పరుగులు చేయగా , కుశాల్ పెరీరా 15 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ప్రస్తుతం లంక ఆరు ఓవర్లకు 35 పరుగులు చేసింది. వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తున్న లంక... భారీ స్కోరు చేసి ఆసిస్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.
ఇప్పటి వరకు శ్రీలంక, ఆస్ట్రేలియా చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. కానీ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. ఆడిన రెండు మ్యాచుల్లోను రెండు జట్లు పరాజయం చవిచూడడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌తో జరిగిన పోరులో శ్రీలంక ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాది ఇదే పరిస్థితి. భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. వరుస ఓటములతో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలబడుతుంది. ఓడిన జట్టుకు ఆశలు మరింత సన్నగిల్లుతాయి.
వరుస గాయాలతో శ్రీలంక జట్టు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక జట్టుకు నడిపించే నాయకుడు దూరం అయ్యాడు. క్లిష్ట సమయంలో శ్రీలంక కెప్టెన్ శనక గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 మొత్తానికి దూరమైనట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈనెల 10న పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా శనక కుడి తొడకు గాయమైంది. కోలుకోవడానికి అతడికి కనీసం 3 వారాలు సమయం పడుతుందని క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. శనక స్థానంలో చమిక కరుణరత్నె జట్టులోకి వచ్చాడు. కరుణ రత్నే ఇప్పటివరకు 23 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైస్ కెప్టెన్‌గా ఉన్న కుశాల్ మెండిస్ నిర్వర్తించనున్నాడు.
శ్రీలంక జట్టు: కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక , కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, లహిరు కుమార
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్†, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement