AUS Vs SL: ఇంట్రస్టింగ్‌గా ఆస్ట్రేలియా, శ్రీలంక రికార్డులు - ఈ మ్యాచ్ తర్వాత ఇంకెన్ని చేరతాయో!
AUS vs SL Head To Head: శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 103 సార్లు తలపడగా... 63 సార్లు విజయం ఆస్ట్రేలియానే వరించింది.
AUS vs SL Head To Head: ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇది 103వ వన్డే మ్యాచ్. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. వీటిలో ఆస్ట్రేలియా 63 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
ఆస్ట్రేలియా, శ్రీలంక రైవల్రీ గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ీ
1. అత్యధిక జట్టు స్కోరు: ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2015 మార్చి 8వ తేదీన జరిగిన సిడ్నీ వన్డేలో శ్రీలంకపై ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది.
2. అత్యల్ప జట్టు స్కోరు: ఈ రికార్డులో కూడా ఆస్ట్రేలియానే నంబర్ వన్ స్థానంలో ఉంది. 2013 జనవరి 18వ తేదీన బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 74 పరుగులకే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది.
3. అతిపెద్ద విజయం: ఇక్కడ కూడా ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో ఉంది. 1985 జనవరి 28వ తేదీన అడిలైడ్ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 232 పరుగుల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది.
4. అత్యల్ప తేడాతో విజయం: 2004 ఫిబ్రవరి 22వ తేదీన దంబుల్లా వన్డేలో శ్రీలంక ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
5. అత్యధిక పరుగులు: రెండు జట్ల మధ్య జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్‌ల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అత్యధిక పరుగులు చేశారు. ఈ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాపై 1,675 పరుగులు చేశాడు.
6. అత్యుత్తమ ఇన్నింగ్స్: 2012 మార్చి 4వ తేదీన బ్రిస్బేన్‌లో జరిగిన వన్డేలో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 163 పరుగులు సాధించాడు. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు.
7. అత్యధిక సెంచరీలు: ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉంది. శ్రీలంకపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆరు సెంచరీలు చేశాడు.
8. అత్యధిక సిక్సర్లు: ఇక్కడ కూడా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌నే నంబర్ వన్. శ్రీలంకపై 36 గిల్లీ భాయ్ సిక్సర్లు కొట్టాడు.
9. అత్యధిక వికెట్లు: శ్రీలంక మాజీ బౌలర్లు లసిత్ మలింగ, మురళీధరన్ ఇందులో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాపై చెరో 48 వికెట్లు పడగొట్టారు.
10. ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: 2011 ఆగస్టు 10వ తేదీన పల్లికెలె మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ శ్రీలంకపై 31 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
మరోవైపు రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వార్త రాసే సమయానికి 30 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. కానీ శ్రీలంక బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం చరిత్ అసలంక (0 బ్యాటింగ్: 5 బంతుల్లో), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్: 5 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, ఆడం జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial