(Source: ECI/ABP News/ABP Majha)
ఆఖరి మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ మెడల్, ఎవరికి దక్కిందంటే?
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ జరుగుతున్నంత వరకూ బెస్ట్ ఫీల్డర్ అవార్టు ఎవరికి వస్తుందా అన్న ఆసక్తి ఉండేది. మైదానంలో ఆటగాళ్లు కూడా మంచి క్యాచ్ పట్టగానే మెడల్ తనకే వస్తుందంటూ సైగలు చేసేవారు.
ICC ODI WC 2023 Finla Match: వన్డే ప్రపంచకప్(World cup) జరుగుతున్నంత వరకూ బెస్ట్ ఫీల్డర్ అవార్టు (Best Fealder Award)ఎవరికి వస్తుందా అన్న ఆసక్తి ఉండేది. మైదానంలో ఆటగాళ్లు కూడా మంచి క్యాచ్ పట్టగానే మెడల్ తనకే వస్తుందంటూ సైగలు కూడా చేసేవారు. ఆటగాళ్ల కోలాహలం మధ్య ప్రకటించే బెస్ట్ ఫీల్డర్ అవార్డు తీసుకోవడానికి వచ్చే ఆటగాళ్లు కూడా సందడి చేసేవారు. కానీ ఈ ఆనందాలన్నీ ఒక్క ఓటమితో నిర్వీర్యంగా... నిస్తేజంగా మారిపోయాయి. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోయాక ఎప్పటిలాగే ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్(T. Delip) బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను ప్రకటించాడు. ఎలాంటి హడావుడి లేకుండానే డ్రెస్సింగ్ రూమ్‌లోనే మెడల్‌ను అందించారు. ప్రతిసారి వినూత్న పద్ధతిలో విజేతను ప్రకటించే దిలీప్ ఈసారి మాత్రం సాదాసీదాగా కోహ్లి(Kohli) పేరును ప్రకటించాడు. ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఫీల్డింగ్ చేసినట్లు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. గత మ్యాచులో అవార్డు అందుకున్న రవీంద్ర జడేజా చేతుల మీదుగా కోహ్లీ ఈ మెడల్‌ను అందుకున్నాడు. ఆసీస్‌తో ఫైనల్లో షమీ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నందుకు ఈ మెడల్ దక్కింది.
From our first medal ceremony to the last - thank you to all the fans who've given us a lot of love for it 💙
— BCCI (@BCCI) November 20, 2023
Yesterday, we kept our spirits high in the dressing room and presented the best fielder award for one final time.
Watch 🎥🔽 - By @28anand#TeamIndia | #CWC23
ఓటమితో నిరాశపడిన భారత డ్రెస్సింగ్ రూమ్‌ను ఉత్సాహపరిచేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. ఓటమిని జీర్ణించుకోలేక ముంచుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయారు. నిరాశతో అలా కూర్చుండిపోయారు. అయితే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆ గంభీర వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. మెడల్ ప్రకటన తర్వాత దిలీప్ మాట్లాడాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారని, అయితే ఫలితం అనుకూలంగా రాలేదని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మెడల్ బహూకరణకు ముందు అన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడికి అభినందలు చెప్పారు. అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారని, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని చెప్పుకొచ్చాడు. ఇక ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చురుగ్గా కదిలాడని, అతడి వల్ల మిగిలిన ఆటగాళ్లలోనూ ఉత్సాహం వచ్చిందన్నారు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లంతా అలా నిరాశగా కూర్చుండిపోగా దిలీప్ స్ఫూర్తిదాయక ప్రసంగంతో వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు. రవీంద్ర జడేజా మెడల్‌ను కోహ్లీ మెడలో వేశాడు. ప్రపంచకప్‌లో ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు దిలీప్ ఇలా మెడల్స్ అందజేశాడు. కోహ్లీ రెండుసార్లు, శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు.. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఒక్కసారి మెడల్స్ గెలుచుకున్నారు.
వన్డే ప్రపంచకప్ 2003లో క్రికెట్ గాడ్ 673 పరుగలు చేయగా భారత్ వేదికగా 2023 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 765 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీతో మెరిసి తన ఆరాధ్య ఆటగాడు సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి 117 పరుగులు చేసే క్రమంలో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును దాటేశాడు. అంతేనా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా తీసుకున్నాడు.