Asian Games 2023 : ఆసియా క్రీడల్లో క్రికెట్ షెడ్యూల్ ఇదే - భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే!
Asian Games 2023 Cricket Schedule: త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా క్రీడల్లో క్రికెట్ జట్ల షెడ్యూల్ వచ్చేసింది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ జట్ల (మెన్స్, ఉమెన్స్) షెడ్యూల్ వచ్చేసింది. పురుషుల క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథి కాగా మహిళల టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. మహిళల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచే మొదలుకానుండగా హర్మన్‌ప్రీత్ సేన తొలి మ్యాచ్‌ను ఈనెల 21న ఆడనుంది. ఇక మెన్స్ షెడ్యూల్ ఈనెల 27న ఆరంభం కానుండగా రుతురాజ్ సేన తొలి మ్యాచ్ అక్టోబర్ 3న జరుగుతుంది.
చైనాలోని హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలకు త్వరలోనే తెరలేవనుంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే ఈ పోటీలలో భారత అథ్లెట్లు, ఇతర క్రీడలతో పాటు క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. గతంలో పలుమార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను ఆడించినా ఈ పోటీలలో భారత్ పాల్గొనలేదు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టును బరిలోకి దింపుతోంది.
మెన్స్ క్రికెట్ షెడ్యూల్ :
టీ20 ఫార్మాట్‌లో జరుగబోయే ఆసియా క్రీడల మ్యాచ్‌లు సెప్టెంబర్ 27న మొదలవుతాయి. 14 జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో ర్యాంకుల ఆధారంగా ఇదివరకే భారత్, పాకిస్తాన్, శ్రీంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. నేపాల్, మంగోలియా, జపాన్, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, మాల్దీవ్స్, హాంకాంగ్, జపాన్‌లు లీగ్ స్టేజ్ లో తలపడతాయి. ఇందులో నాలుగు జట్లు క్వార్ట్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ఈవెంట్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 03న ఫింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో క్వార్టర్స్‌కు గ్రూప్ - ఎ నుంచి అర్హత సాధించే తొలి జట్టుతో ఆడనుంది. అక్టోబర్ 06 న రెండు సెమీఫైనల్స్, ఏడో తేదీన మూడో స్థానం కోసం జరిగే జట్టు తలపడనుండగా అదే రోజు ఫైనల్ జరుగుతుంది.
Men's Cricket in Asian Games 2023:-
— CricketGully (@thecricketgully) September 4, 2023
Group A - Afghanistan vs Mongolia
Group B - Nepal, Japan, Cambodia
Group C - Hong Kong China, Singapore, Thailand
Group D - Malaysia, Bahrain, Maldives
QF1:- IND vs TBD
QF2:- PAK vs TBD
QF3:- SL vs TBD
QF4:- BAN vs TBD pic.twitter.com/1pPXquu4tw
ఉమెన్స్ క్రికెట్ షెడ్యూల్ :
మహిళల క్రికెట్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ - ఎ నుంచి ఇండోనేషియా, మంగోలియా.. గ్రూప్ - బి నుంచి హాంకాంగ్, మలేషియాలు లీగ్ దశలో తలపడతాయి. ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించాయి. గ్రూప్ - ఎ నుంచి అగ్రస్థానంలో ఉన్న జట్టుతో భారత్ సెప్టెంబర్ 21న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈెల 24న రెండు సెమీస్‌లు, 25న మూడో స్థానం కోసం పోటీ పడే జట్టు మ్యాచ్‌లు ఆడతాయి. అదే రోజు ఫైనల్ జరుగుతుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial