By: ABP Desam | Updated at : 25 Sep 2023 01:23 PM (IST)
స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ( Image Source : Twitter )
Asian Games 2023: ఆసియా క్రీడలలో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు తుది పోరులో తడబడింది. శ్రీలంకతో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంక స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ స్మృతి మంధాన (45 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) , జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42, 5 ఫోర్లు) రాణించినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.
హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్‌తో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (9) నిరాశపరిచింది. 16 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే వన్ డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మంధాన భారత ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు.
Well played, Smriti Mandhana...!!!
— Johns. (@CricCrazyJohns) September 25, 2023
46 runs from 45 balls in the Asian Games final in a tough pitch for team India against Sri Lanka. pic.twitter.com/BtygP89K2W
అర్థ సెంచరీకి చేరువైన మంధానను రణవీర ఔట్ చేసి లంకకు బ్రేక్ ఇచ్చింది. 14.5వ ఓవర్లో మంధాన ఔట్ అయింది. ఇక ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ (9), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (2), పూజా వస్త్రకార్ (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు.
India posted 116 for 7 from 20 overs in the Asian Games final against Sri Lanka.
— Johns. (@CricCrazyJohns) September 25, 2023
Smriti 46(45) & Jemimah 42(40) played so well on a tough pitch. pic.twitter.com/stXaImYPWo
15వ ఓవర్ దాకా మెరుగ్గానే సాగిన భారత ఇన్నింగ్స్ తర్వాత తడబాటుకు గురైనా జెమీమా మాత్రం పోరాడింది. 16 ఓవర్లకు 100-2గా ఉన్న భారత స్కోరు.. తర్వాత నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ చేసింది 27 పరుగులైతే ఐదు వికెట్లు నష్టపోయి కనీసం పోరాడే టార్గెట్‌ను కూడా లంక ముందు నిలుపలేకపోయింది.
మ్యాచ్ ఆరంభంలోనే షఫాలీని ఔట్ చేసినా తర్వాత మంధాన - జెమీమాల భాగస్వామ్యాన్ని విడదీసిన లంక బౌలర్లు తర్వాత భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆజట్టు మెరుగ్గా రాణించి భారత్ పరుగులు తీయకుండా అడ్డుకట్ట వేసింది. లంక జట్టులో ఏకంగా ఏడుగురు బౌలింగ్ చేయడం గమనార్హం. రణసింగె, ప్రబోధని, ప్రియదర్శిని, సుగంధిక కుమారి, కెప్టెన్ చమరి ఆటపట్టు, కవిశా దిల్హరి, ఇనోకా రణవీరలు భారత్ పరుగుల ప్రవాహాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. రణవీర, సుగంధిక, ప్రబోధనిలకు తలా రెండు వికెట్లు దక్కాయి. మరి ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత బౌలర్లు ఏ మేరకు డిఫెండ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం.
West Indies Cricket: దేశం వద్దు లీగ్‌లే ముద్దు, కాంట్రాక్టులు వద్దన్న విండీస్ క్రికెటర్లు
Rohit Sharma: ఫిట్ గురూ కోహ్లీనే, రోహిత్ కూడా ఫుల్ ఫిట్
Travis Head: ప్లేయర్ ఆఫ్ ది మంత్ హెడ్ , భారత పేసర్ షమీకి తప్పని నిరాశ
Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్ ఆగ్రహం
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>