Asia Cup 2025 Trophy: పాక్‌కు మరో అవమానం.. ఆసియా కప్ ట్రోఫీని నిరాకరించిన టీమిండియా, ఆ తర్వాత ఏమైంది?
Asia Cup 2025 Winner | ఆ జట్టు నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోలేదు, కానీ ఆయన వేదికపైనే ఉన్నారు. విజేతలకు ట్రోఫీ అందలేదు. బహుశా ఇది క్రికెట్లో మొదటిసారి.

Asia Cup 2025 Final News Updates | టీమిండియా అనుకున్నంత పని చేసింది. ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిశాక మైదానంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్ ట్రోఫీని అందుకోలేదు. ఎందుకంటే వారు పాకిస్తాన్ మంత్రి, ACC అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుని పాక్‌ను చావు దెబ్బ కొట్టారు.
ఆసియా కప్ ట్రోఫీని నిరాకరించిన భారత్
ట్రోఫీ అవార్డుల ప్రదానోత్సవం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది, కానీ వ్యక్తిగత అవార్డులు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మాత్రమే అందుకున్నారు. భారత జట్టు పాకిస్తాన్‌కు చెందిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించుకుంది, కాని నక్వీ వేదికపైనే ఉండి ట్రోఫీ అందజేయడానికి సిద్ధంగా ఉన్నా నిరాశే ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్ కు చెందిన వ్యక్తి నుంచి భారత్ ట్రోఫీని అందుకోవడానికి వెళ్లకుండా మైదానంలో టైంపాస్ చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. చివరికి, విజేత జట్టు టీమిండియాకు ట్రోఫీని అందజేయలేదు. బహుశా క్రికెట్ లో ఇది తొలిసారి కావొచ్చు.

ట్రోఫీ ప్రదానం ఆలస్యం అయినప్పటికీ, భారతదేశానికి చెందిన చాలా మంది అభిమానులు మైదానంలోనే ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా వేదికపైకి వెళ్ళినప్పుడు భారత్ మాతాకీ జై అని అభిమానులు అరిచారు. భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఖాలిద్ అల్ జరూని నుండి ట్రోఫీని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, అతను నక్వీతో పాటు వేదికపై ఉన్నాడు, కాని నక్వీ అందుకు సిద్ధంగా లేడు. దాంతో భారత జట్టు ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే ఆసియా కప్ ట్రోఫీని అందుకోలేదు.
Swag of Team India 🇮🇳
— Trupti Garg (@garg_trupti) September 28, 2025
Team India refuses to take trophy from Pakistani officials & ignore them 🥳#AsiaCup2025 #INDvPAK pic.twitter.com/2kggf1JCjy
భారత్ మాతాకీ జై నినాదాలు
నక్వీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభానికి ముందు ఒక వైపు నిలబడ్డాడు. భారత ఆటగాళ్ళు 15 గజాల దూరంలో ఉండి అంతా గమనిస్తున్నారు. నక్వీ పక్కకు జరగకపోవడంతో వేడుక ఆలస్యమైంది. విజేత ట్రోఫీని ఎవరు అందజేస్తారని భారత జట్టు యాజమాన్యం అడిగినట్లు సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పరస్పర సంప్రదింపులు జరిపింది., ఎందుకంటే భారత జట్టు నక్వీ నుండి ట్రోఫీని తీసుకోదని వారికి తెలుసు. నక్వీ వేదికపైకి వచ్చిన తర్వాత, భారత అభిమానులు 'భారత్ మాతాకీ జై' నినాదాలు చేశారు.
Team India celebrating Asia Cup victory!
— Shilpa (@shilpa_cn) September 28, 2025
Suryakumar Yadav recreates Rohit Sharma’s iconic 2024 T20 World Cup celebration! 🇮🇳🔥❤️#INDvsPAK #AsiaCupFinal #AsiaCup2025pic.twitter.com/jbkRYsipIv
ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లిన నిర్వాహకులు
నక్వీ వేదికపైకి రాగా, భారత జట్టు అతని నుండి ట్రోఫీని తీసుకోదని, బలవంతంగా ట్రోఫీ ఇవ్వాలని ప్రయత్నించినా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుకోడని స్పష్టం చేశారు. భారత జట్టు వస్తుందని నక్వీ వేదికపై కాసేపు వేచి ఉన్నాడు. తరువాత నిర్వాహకులలో ఒకరు ఆసియా కప్ ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.
ఆసియా కప్ 2025లో జరిగిన 3 మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపని భారత జట్టు, టాస్ సమయంలో కెప్టెన్ సూర్య, టాస్ కు ముందు ఫోటో షూట్‌లో కూడా పాల్గొనలేదు. భారత జట్టు ACCకి తాను నక్వీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేది లేదని గట్టి మెస్సేజ్ ఇచ్చింది.





















