By: ABP Desam | Updated at : 13 Sep 2023 10:48 AM (IST)
భారత్ - పాకిస్తాన్ ( Image Source : Asian Cricket Council Twitter )
Asia Cup 2023: నాలుగేండ్ల క్రితం ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఇటీవలే పదిరోజుల వ్యవధిలో రెండు వన్డేలు ఆడిన భారత్ - పాకిస్తాన్‌లు వన్డే వరల్డ్ కప్ కంటే ముందే మరో హైఓల్టేజ్ థ్రిల్లర్‌లో పోటీ పడే అవకాశాలున్నాయి. అన్నీ అనుకూలిస్తే భారత్ - పాక్ ఫైనల్‌ను అభిమానులు మరోసారి చూడొచ్చు. కానీ అలా జరగాలంటే పాకిస్తాన్.. సూపర్ - 4లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండ గెలవాలి.
పాయింట్ల పట్టిక ఇలా..
పాకిస్తాన్‌పై 228 పరుగుల తేడాతో విజయదుందుబి మోగించిన భారత జట్టు మంగళవారం శ్రీలంకను కూడా 41 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా రెండు విజయాలతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవడమే గాక ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం భారత్.. 4 పాయింట్లతో +2.690 నెట్ రన్ రేట్‌తో మెరుగైన స్థితిలో ఉంది. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. లంక నెట్ రన్ రేట్ -0.200 గా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకటి గెలిచి మరోదాంట్లో ఓడి రెండు పాయింట్లతో లంకతో పాటు సమానంగా ఉన్నా పాక్ నెట్ రన్ రేట్ -1.892లో వెనుకబడింది. రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
భారత్ - పాక్ ఫైనల్ జరగాలంటే..
దాయాదుల మధ్య ఫైనల్ పోరు చూడాలంటే పాకిస్తాన్‌కు గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో లంకను ఓడిస్తేనే పాకిస్తాన్ తుదిపోరుకు అర్హత సాధించే అవకాశముంటుంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ జరుగకపోయినా, అర్థాంతరంగా ముగిసినా అప్పుడు పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవు.
లంకకూ ఛాన్స్..
సూపర్ - 4లో మంగళవారం భారత్‌తో ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఓడిన లంకేయులకు ఫైనల్ చేరడానికి మరో అవకాశం ఉంటుంది. బుధవారం పాకిస్తాన్‌తో జరిగే పోరులో లంక గెలిస్తే అప్పుడు ఆసియా కప్ - 2023 ఫైనల్ భారత్ - శ్రీలంక మధ్య జరుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న లంకకే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
టాప్ మనమే..
వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత జట్టు ఆసియా కప్ వ్యక్తిగత గణాంకాలలోనూ టీమిండియా ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ శర్మ (194) అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత నజ్ముల్ హోసేన్ శాంతో (193), బాబర్ ఆజమ్ (178) టాప్ - 3లో ఉన్నారు.
అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో కూడా కుల్‌దీప్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌లలో కుల్‌దీప్.. 9 వికెట్లు పడగొట్టాడు. దునిత్ వెల్లలాగే, హరీస్ రౌఫ్ కూడా 9 వికెట్లతో కుల్‌దీప్‌తో సమానంగా ఉన్నా బౌలింగ్ సగటు (11.33) భారత స్పిన్నర్‌కే మెరుగైన గణాంకాలున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
World Cup 2023: వార్మప్ మ్యాచ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న న్యూజిలాండ్ - 43.4 ఓవర్లలోనే 346 టార్గెట్ ఉఫ్!
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>