News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Asia Cup 2023: గాయాల లంక - మరో పేసర్ ఔట్- ఆసియా కప్‌కు ముందే శ్రీలంకకు ఎదురుదెబ్బలు

రేపట్నుంచి మొదలుకాబోయే ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టు గాయాలతో సతమతమవుతున్నది.

FOLLOW US: 
Share:

Asia Cup 2023: ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలు ముందున్న  నేపథ్యంలో శ్రీలంక గాయాలతో సతమతమవుతున్నది.  ఆ జట్టు బౌలర్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతూ టీమ్‌కు దూరమవుతున్నారు. రేపటి నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే ఆసియా కప్ ప్రారంభానికి ముందే  ఆ జట్టుకు చెందిన  నలుగురు బౌలర్లు గాయపడ్డారు. ఇదివరకే స్టార్ పేసర్ దుష్మంత చమీర,  లాహిరు కుమారతో పాటు  స్పిన్నర్ వనిందు హసరంగ గాయాలతో జట్టుకు దూరమవగా తాజాగా ఆ జాబితాలో యువ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా  ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. 

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్  మధుశంక గత శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మధుశంక కాలి కండరానికి గాయమైంది. అతడిని పరీక్షించిన వైద్య బృందం.. మధుశంకకు విశ్రాంతి అవసరమని తేల్చడంతో  అతడు ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ యువపేసర్ గాయం వరల్డ్ కప్ వరకు మానుతుందా..? అన్నది అనుమానంగానే ఉంది.  అదే జరిగితే లంకకు  ప్రపంచకప్‌లో భారీ షాక్ తప్పదు. 

ఇప్పటికే లంక జట్టులో  రైట్ ఆర్మ్ పేసర్ దుష్మంత చమీర గాయంతో ఆసియా కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చమీర గాయం తీవ్రతను బట్టి  చూస్తే అతడు కూడా వరల్డ్ కప్ వరకు కోలుకునేది కష్టమేనని తెలుస్తున్నది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ  తొడ కండరాల గాయంతో ఆసియా కప్ ‌కు దూరంగా ఉన్నాడు. లాహిరు కుమారదీ అదే పరిస్థితి.  ఈ నలుగురూ లంక బౌలింగ్  దళానికి కీలకంగా ఉన్నవారే.. వీరిలో చమీరతో పాటు మధుశంకలు గతేడాది యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్ (టీ20 ఫార్మాట్)లో  శ్రీలంక బౌలింగ్‌కు నాయకత్వం వహించి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మరి ఈ నలుగురు ఆసియా కప్ తర్వాత ఎంత త్వరగా కోలుకుంటారనేది ఆ జట్టుకు కీలంక కానుంది. 

రేపట్నుంచి మొదలుకాబోయే ఆసియా కప్‌లో శ్రీలంక ఇంకా తమ జట్టును అధికారికంగా ప్రకటించలేదు.   15 మందితో కూడిన జట్టును శ్రీలంక బోర్డు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. కానీ క్రీడా శాఖ ఇంకా దానికి ఆమోదముద్ర వేయలేదు.  నేటి  సాయంత్రం వరకు లంక జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

శ్రీలంక బోర్డు ఫైనల్ చేసిన జట్టు : దసున్ శనక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ పెరెరా, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, దుశన్ హేమంత, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుశాన్, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక, మతీశ పతిరాన 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Aug 2023 11:03 AM (IST) Tags: Asia cup 2023 Wanindu Hasaranga Sri Lanka Cricket Team Dilshan Madhushanka Dushmant Chameera

ఇవి కూడా చూడండి

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?

ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?

Australia squad: ఆసీస్‌ ప్రపంచకప్‌ టీమ్‌లో మార్పు! భీకర్‌ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ వచ్చేశాడు!

Australia squad: ఆసీస్‌ ప్రపంచకప్‌ టీమ్‌లో మార్పు! భీకర్‌ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ వచ్చేశాడు!

World Cup 2023: టీమ్ఇండియా వరల్డ్ కప్‌ జట్టులో మార్పులు- అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు

World Cup 2023:  టీమ్ఇండియా వరల్డ్ కప్‌ జట్టులో మార్పులు- అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

టాప్ స్టోరీస్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే