Asia Cup 2022: ఆసియా కప్ పాకిస్థాన్ దే- వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
Asia Cup 2022: నేడు జరిగే మ్యాచ్ లో శ్రీలంకను భారత్ ఓడించకపోతే పాకిస్థాన్ ఆసియా కప్ ను ఎగరేసుకుపోతుందని.. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
నేడు జరిగే మ్యాచ్ లో శ్రీలంకను భారత్ ఓడించకపోతే పాకిస్థాన్ ఆసియా కప్ ను ఎగరేసుకుపోతుందని.. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆసియా కప్ లో చాలా కాలం తర్వాత టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిందన్నాడు. దీన్ని బట్టి చూస్తే కప్ గెలిచే అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువగా ఉంటాయని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇదలా ఉంచితే ఈరోజు జరిగే మ్యాచ్ భారత్ కు చావో రేవో లాంటింది. నేడు శ్రీలంకతో మ్యాచ్ ఓడిపోతే ఫైనల్ కు దాదాపు దారులు మూసుకుపోయినట్లే. అదే కనుక జరిగితే టేబుల్ టాపర్ గా శ్రీలంక, సెకండ్ ప్లేస్ తో పాక్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. బలాబలాల పరంగా చూసుకుంటే లంక కన్నా దాాయాది దేశమే పైచేయిగా ఉంది. కాబట్టి కప్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ నేడు భారత్ గెలిస్తే సమీకరణాలు మారిపోతాయి. ఆ తర్వాతి మ్యాచ్ లో అఫ్ఘనిస్థాన్ ను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్ కు చేరిపోవచ్చు. అయితే ఈ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో టీమిండియా విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఏదేమైనా ముందు శ్రీలంకపై విజయం సాధించడమే భారత్ ముందున్న ప్రథమ లక్ష్యం.
Asia Cup 2022 Winner: Sehwag also stated that the next game against Sri Lanka is a must-win for India : https://t.co/zzt7GEnOOK#virendarsehwag #asiacuo2022 #INDvsSL pic.twitter.com/A7eMaO3Ey2
— India.com (@indiacom) September 6, 2022