అన్వేషించండి

Ashes Series 2023: వీళ్లు దంచారు - వాళ్లు కూల్చారు - రసవత్తరంగా మొదలైన యాషెస్ రణరంగం

ENG vs AUS: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. దూకుడుకు మారుపేరైన కంగారూలనే కంగారెత్తించింది.

Ashes Series 2023: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాషెస్ రణరంగానికి అద్భుత ఆరంభం  దక్కింది.  ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. దూకుడుకు మారుపేరైన కంగారూలనే కంగారెత్తించింది.  ఈ క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయినా ‘బజ్‌బాల్’ దృక్పథాన్ని మాత్రం వీడలేదు.  తొలి రోజు 78 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..8 వికెట్లు కోల్పోయి  393 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్ (152 బంతుల్లో  118 నాటౌట్,  7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు.  

మీ దూకుడు.. సాటెవ్వడు.. 

గత ఏడాది కాలంగా తమ దూకుడైన ఆటకు బజ్‌బాల్ అని పేరు పెట్టుకుని  మరీ ప్రత్యర్థులపై వీరవిహారం చేస్తున్న  ఇంగ్లాండ్..  నేడు ఆసీస్‌కూ దాని రుచి చూపించింది.  పాట్ కమిన్స్ వేసిన  ఫస్ట్ బాల్‌నే జాక్ క్రాలీ (73 బంతుల్లో 63, 7 ఫోర్లు)  బౌండరీ  పంపించాడు.  మరో ఓపెనర్ బెన్ డకెట్ (12) విఫలమైనా  క్రాలీ మాత్రం క్రీజులో ఉన్నంతసేపూ  దూకుడుగా ఆడాడు.  ఓలీ పోప్ (44 బంతుల్లో 31, 2 ఫోర్లు) తో కలిసి రెండో వికెట్‌కు  70 పరుగులు  జోడించాడు.  అయితే లంచ్‌కు వెళ్లే ముందు ఇంగ్లాండ్ క్రాలీతో పాటు పోప్ వికెట్లను కోల్పోయింది. 

‘రూట్’ వేశాడు.. 

లంచ్ తర్వాత  ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్..  హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 32, 4 ఫోర్లు) తో కలిసి నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.  కానీ దురదృష్టవశాత్తూ  బ్రూక్.. నాథన్ లియన్ బౌలింగ్ లో బంతి  వికెట్లను తాకడంతో ఔట్ అయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (1) నిరాశపరిచాడు. కానీ  వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78, 12 ఫోర్లు) ఇంగ్లాండ్ ను పోటీలోకి తెచ్చాడు. వన్డే తరహా ఆట ఆడిన బెయిర్‌స్టో.. రూట్‌తో కలిసి  ఏడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు.    బెయిర్‌‌స్టో తో పాటు రూట్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

బెయిర్‌స్టో ను లియాన్.. 62వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు.  ఇటీవలే టెస్టులలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మోయిన్ అలీ (18) ధాటిగా ఆడే క్రమంలో నిష్క్రమించాడు. కానీ రూట్ మాత్రం టెయిలెండర్ల సాయంతో  ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టులలో రూట్‌కు ఇది 30వ సెంచరీ కావడం గమనార్హం.   స్టువర్ట్ బ్రాడ్ (21 బంతుల్లో  16,  2 ఫోర్లు), ఓలీ రాబిన్సన్ (31 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు) రూట్ కు అండగా నిలిచి ఇంగ్లాండ్ స్కోరును  393కు చేర్చారు.  

 

షాకింగ్ డిసీషన్.. 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 78 ఓవర్ ముగియగానే  స్టోక్స్..  తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం గమనార్హం. మరో రెండు వికెట్లు చేతిలో ఉన్నా..  రూట్ మంచి టచ్ లో ఉన్నా  స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.  ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా  స్టోక్స్‌కు ఇది చేటు తేవడం ఖాయం. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా కూడా నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసింది. పొద్దంతా ఫీల్డింగ్ చేసి  అలిసిపోయి  ఒకటో, రెండు వికెట్లో కోల్పోక పోతారా..? అని ఆశగా ఎదురుచూసిన ఇంగ్లాండ్ బౌలర్లకు ఆసీస్ ఓపెనర్లు ఛాన్స్ ఇవ్వలేదు.  డేవిడ్ వార్నర్ (13 బంతుల్లో  8 నాటౌట్, 2 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (12 బంతుల్లో 4 నాటౌట్)  లు క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్.. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Embed widget