అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jonny Bairstow: లార్డ్స్ లో వికెట్ పోయింది - లీడ్స్ లో బుద్దొచ్చింది - ఓవర్ ముగిసినా క్రీజు వదలని బెయిర్ స్టో

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఇటీవలే లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లీష్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదమైంది.

Jonny Bairstow: యాషెస్ సిరీస్ లో భాగంగా  ఇటీవలే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య   రెండో టెస్టులో ఆథిత్య జట్టు వికెట్ కీపర్ బ్యాటర్  జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.  ఓవర్ ముగిసిందన్న తొందర్లో బెయిర్ స్టో..  క్రీజు దాటి ముందుకు పోవడంతో  ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ త్వరగా స్పందించి  త్రో విసిరాడు. దీంతో బెయిర్ స్టో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. లార్డ్స్ లో వికెట్ కోల్పోయిన భయమో మరే కారణమో గానీ  లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం క్రీజును వీడలేదు. 

బ్యాట్ తీస్తే ఒట్టు.. 

హెడింగ్లీ (లీడ్స్) వేదికగా  గురువారం   ప్రారంభమైన మూడో టెస్టులో  ఆట చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన బెయిర్ స్టో.. మిచెల్ మార్ష్ వేసిన 14వ ఓవర్ లో వచ్చీరాగానే  క్రీజును అతుక్కుపోయాడు. తాను ఎదుర్కున్న తొలి బంతిని మిడాన్ దిశగా ఆడిన బెయిర్ స్టో పరుగేమీ రాకున్నా ముందుకొచ్చిన భయంతో మళ్లీ  వెంటనే క్రీజులోకి వచ్చి  బ్యాట్ తీయకుండా పట్టుకున్నాడు.  

ఇదే ఓవర్లో ఆఖరి బంతిని కట్ చేయబోయాడు.  కానీ బాల్ మిస్ అయ్యి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది.  అయితే  కేరీ బాల్ పట్టి అతడు తిరిగి అవతలి ఎండ్ కు వెళ్లే క్రమంలో సగం క్రీజు దాటేదాకా బెయిర్ స్టో  బ్యాట్ తీయకుండా అలాగే పట్టుకున్నాడు. క్రీజును దాటే క్రమంలో  బెయిర్ స్టో.. ఆసీస్ ఆటగాళ్లను ఓరకంట చూస్తూ ‘ఇదిగో చూశావా, బ్యాట్ క్రీజులోనే ఉంది’అన్నట్టుగా లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

మార్ష్ సెంచరీ.. వుడ్ ఫైపర్ 

ఇక లీడ్స్ టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా మొదలైంది.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఇంగ్లాండ్ ఆహ్వానం మేరకు ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా 60.4 ఓవర్లలో 263 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ షేన్ వార్నర్ (3), ఉస్మాన్ ఖవాాజ (13), మార్నస్ లబూషేన్ (21) తో పాటు వందో టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్ (22) కూడా విఫలమయ్యారు.  కానీ ట్రావిస్ హెడ్ (39) అండతో మిచెల్ మార్ష్ (118 బంతుల్లో 118, 17 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆసీస్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు  155 పరుగులు జోడించారు.  ఇంగ్లాండ్ బౌలర్లను మార్ష్  ఆటాడుకున్నాడు.  

కానీ ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ సంచలన స్పెల్ తో ఆసీస్.. 239-4 నుంచి 263కి ఆలౌట్ కావడం గమనార్హం. అతడు వేసిన 53వ ఓవర్లో హెడ్ ఔట్ కాగా  ఆ తర్వాత  వరుసగా మార్ష్, మిచెల్ స్టార్క్, కమిన్స్, మర్ఫీల పనిపట్టాడు.  ఆసీస్ ఆఖరి ఆరు వికెట్లను  26 పరుగుల తేడాతో కోల్పోయింది. వుడ్.. 11.4 ఓవర్లే బౌలింగ్ చేసి  4 మెయిడిన్లు వేయడమే గాక ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. 

ఇంగ్లాండ్ టాపార్డర్ ఖతం.. 

ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషం ఇంగ్లాండ్ కు ఎంతోసేపు నిలువలేదు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్  ప్రారంభమయ్యాక నాలుగో ఓవర్లోనే బెన్ డకెట్ (2) ను కమిన్స్ ఔట్ చేశాడు. వన్ డౌన్ కు ప్రమోట్ అయిన హ్యారీ బ్రూక్ (3) కూడా కమిన్స్  చేతికే చిక్కాడు.  ఆసీస్ ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో  మార్ష్.. జాక్ క్రాలే (33) ను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్.. 65 పరుగులకే టాపార్డర్ ను కోల్పోయింది.  

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget