అన్వేషించండి

Arshdeep VS Chahal: చాహల్‌కు సారీ చెప్పిన అర్షదీప్ - చేతివేళ్లను చేవులకు ఆనించి, యూజీ భాయ్ అంటూ..

Yuzvendra Chahal: తొలి టీ20లో 2 వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డు చాహల్ పేరిట ఉండగా, తాజాగా 97 వికెట్లతో అర్షదీప్ బద్దలు కొట్టాడు.

Eng Vs Ind Series News: భారత లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టు పేసర్ అర్షదీప్ సింగ్ చేసిన తాజా పని వైరలయ్యింది. లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌కు క్షమాపణలు చెప్పడంపై పలువురు షాక్‌కు గురయ్యారు. చేతి వేళ్లు చెవులకు ఆనించుకుని మరీ చాహల్‌కు సారీ చెప్పాడు. ఈ తతంగాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేయగా క్షణాల్లో వైరలైంది. ఈ వీడియోపై భారత అభిమానులు కామెంట్లు చేస్తూ, షేర్లు, లైకులు చేస్తూ తెగ వైరల్ చేశారు. ఇంతకీ చాహల్‌కు అర్షదీప్ ఎందుకు సారీ చెప్పాడంటే.. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు చాహల్ (96 వికెట్లు ) పేరిట ఉండగా, తాజాగా 97 వికెట్లతో అర్షదీప్ బద్దలు కొట్టాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మెగాటోర్నీలో ఆడతాడా..?
టీ20ల్లో రెగ్యులర్‌గా ఆడుతున్న అర్షదీప్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం ఛాన్సులు రావడం లేదు. 61 టీ20లు ఆడిన అర్షదీప్ కేవలం 8 వన్డేలే ఇప్పటివరకు ఆడాడు. అయితే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ గాయాల కారణంగా అందుబాటులో లేకపోతే జట్టు తరఫున ఆడే అవకాశం దక్కుతుంది. పిన్ పాయింట్ యార్కర్లు, అద్భుతమైన స్వింగ్‌తో ప్రత్యర్థులను అర్షదీప్ బోల్తా కొట్టించగలడు. మెగా టోర్నీకి ఛాన్స్ దొరికితే రెండు చేతులా ఒడిసి పట్టుకునేందుకు అర్షదీప్ సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో పట్టు సాధించాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. చెన్నైలో ఈ నెల జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

2023 నుంచి దూరంగా చాహల్..
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చాహల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. 2023లో తను చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే తన భార్య ధనశ్రీ వర్మతోనూ దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇరువురు భార్యాభార్తలు విడివిడిగా ఉంటుండంతో పాటు రూమర్లపై స్పందించకపోవడంతో విడాకుల విషయం ఇంకా జటిలంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చాహల్ భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడటం లేదు. దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి తను జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కేవలం దేశవాళీల్లో మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు తన సహ కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటోలను చూసి చాహల్ అభిమానులు మండిపడుతున్నారు. చాహల్‌ను ధనశ్రీ మోసం చేసిందని భారీగా ట్రోల్ చేశారు. ఏదేమైనా చాహల్ టీమిండియా తరపున ఆడుతుంటే తన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండేదని, సెంచరీ వికెట్ల మార్కును ఎప్పుడో దాటేవాడని అభిమానులు పేర్కొంటున్నారు. 

Also Read: షమీని అందుకే తీసుకోలేదా..? రీ ఎంట్రీపై అభిమానుల్లో పలు సందేహాలు.. ఎప్పుడు ప్లేయింగ్ లెవన్లోకి వస్తాడోనని వెయిటింగ్..!

టాప్ హెడ్ లైన్స్

England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget