Ajinkya Rahane Becomes Father: మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్
Ajinkya Rahane Becomes Father: అజింక్యా రహానే సెప్టెంబర్ 2014లో రాధికా ధోపావ్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం మరాఠీ సంప్రదాయాలతో పూర్తయింది.
Ajinkya Rahane Becomes Father: భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్యా రహానే భార్య రాధిక బుధవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. టీమిండియా ఆటగాడు రహానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త అందించాడు. రాధిక, ఆమె కుమారుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని రహానే తెలిపాడు. తల్లీబిడ్డను దీవించి తమ ఆశీస్సులు అందించిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా రహానే సోషల్ మీడియాలో అభిమానుల కోసం ప్రత్యేక లేఖను కూడా షేర్ చేశాడు.
రహానే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేశాడు. ఇందులో బుధవారం ఉదయం తన భార్య రాధిక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఈ లేఖ ద్వారా తన అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. రహానే లేఖలో ఇంకా ఏం రాశాడంటే... “ఈ ఉదయం రాధిక, నేను నా మగ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించాము. రాధిక, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరీ ప్రార్థనలకు మేము ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు.
View this post on Instagram
అజింక్యా రహానే సెప్టెంబర్ 2014లో రాధికా ధోపావ్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం మరాఠీ సంప్రదాయాలతో పూర్తయింది. మీడియా కథనాల ప్రకారం, రహానే, రాధిక చిన్ననాటి స్నేహితులు. 2019లో ఈ బిడ్డ కంటే ముందే రాధిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఆర్య.