అన్వేషించండి

NED vs AFG: డచ్‌ పోరాటమా.. అఫ్గాన్‌ విజయమా, ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు

ODI World Cup 2023:  భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న అఫ్గానిస్థాన్‌.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది.

 భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న అఫ్గానిస్థాన్‌.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి   సెమీస్‌ చేరాలని అఫ్గాన్‌ జట్టు పట్టుదలగా ఉంది. ఇప్పటికీ అఫ్గాన్‌కు.. నెదర్లాండ్స్‌కు  సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ముందడుగు వేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి ప్రకంపనలు సృష్టించాయి. ప్రపంచకప్‌లో నాలుగో బెర్తు కోసం జరుగుతున్న సమీకరణాలు ఆసక్తిని పెంచుతున్న వేళ నేడు జరగనున్న మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అఫ్గాన్‌ సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకు వేయగలదు. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘన్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా 3 గెలిచింది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చి విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న అఫ్గాన్‌ నేడు నెదర్లాండ్స్‌పై గెలిస్తే ఐదో స్థానానికి చేరుకుంటుంది.
 
అఫ్గాన్‌ స్పిన్‌ మంత్రం
పాయింట్ల పట్టికో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు సమానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారూ, కివీస్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేస్తే అప్గాన్‌కు సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి. నెదర్లాండ్స్‌కు కూడా సెమీస్‌ చేరే అవకాశం ఉంది. 2023 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి నెదర్లాండ్స్ పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పైనా డచ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఈ రెండు విజయాలు నెదర్లాండ్స్‌ను సెమీ ఫైనల్ రేసులో సజీవంగా నిలిపాయి. పాయింట్ల పట్టికలో డచ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఈరోజు ఆఫ్ఘానిస్థాన్‌ను ఓడిస్తే.. నెదర్లాండ్స్‌కు సెమీఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగవుతాయి. కానీ డచ్‌ జట్టు ఇక్కడ ఓడిపోతే సెమీస్‌ ఆశలకు తెరపడుతుంది. ఇప్పటివరకూ నెదర్లాండ్స్‌-అప్ఘాన్ మధ్య 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ 7 గెలిచింది. డచ్ జట్టు రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్ల మధ్య గత నాలుగు మ్యాచ్‌లు కూడా అఫ్గానే గెలిచింది. నేటి మ్యాచ్‌లోనూ అఫ్గానిస్థాన్‌దే పైచేయిలా కనిపిస్తోంది.
 
బ్యాటింగ్‌పైనే నెదర్లాండ్స్‌ భారం
లక్నోలోని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మైదానంలో జరిగిన 12 మ్యాచుల్లో  రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే తొమ్మిది సార్లు గెలిచాయి. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన అఫ్గాన్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం డచ్‌ జట్టు అంత తేలిక కాదు.  2003 ప్రపంచ కప్‌లో కెన్యా సెమీ ఫైనల్‌ చేరినట్లే ఈసారి తాము కూడా వరల్డ్‌ కప్‌ సెమీస్‌ చేరాలని అఫ్గాన్‌ భావిస్తోంది. ఈ మ్యాచ్‌ తర్వాత నవంబర్‌ ఏడున ఆస్ట్రేలియా నవంబర్ 10న దక్షిణాఫ్రికాతో అప్గాన్‌ తలపడనుంది.  పాకిస్థాన్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్-రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ భారీగా పెంచుకోవాలని అఫ్గాన్‌ భావిస్తోంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (226), అజ్మతుల్లా ఒమర్జాయ్ (203, రహ్మానుల్లా గుర్బాజ్ (224), రహ్మత్ షా (212), ఇబ్రహీం జర్దాన్ (212) బ్యాటింగ్‌లో రాణిస్తుండడం అఫ్గాన్‌కు కలిసిరానుంది. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వంటి స్పిన్‌తో అఫ్గాన్‌ బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ ఎడ్వర్డ్స్ రెండు అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, కోలిన్ అకెర్‌మాన్, లోగాన్ వాన్ బీక్‌లతో డచ్‌ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. బంగ్లాదేశ్‌పై వాన్ బీక్ 16 బంతుల్లో 23  పరుగులు చేశాడు. 
 
అఫ్గానిస్థాన్‌ జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫ్ఫజ్ ఉర్ రహ్మద్ , అబ్దుల్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్
 
నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లైన్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్ విక్రమ్‌జిత్ సింగ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget