RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?
WPL 2023, RCB-W vs MI-W: నేటి ముంబయి పోరులో ఆర్సీబీ తేలిపోయింది. ఆఖరి లీగు మ్యాచులో ప్రత్యర్థికి 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది.
WPL 2023, RCB-W vs MI-W:
విమెన్ ప్రీమియర్ లీగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన రోజుకొకలా ఉంటోంది! ఒకసారి అద్భుతాలు చేస్తే మరోసారి పేలవంగా ఆడుతోంది. మొన్నే ధనాధన్ ఇన్నింగ్సులతో మురిపించింది. నేటి ముంబయి పోరులో తేలిపోయింది. ఆఖరి లీగు మ్యాచులో ప్రత్యర్థికి 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3x4, 2x6) ఒక్కరే మెరుపు షాట్లతో ఆకట్టుకుంది. ఎలిస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించింది. అమెలియా కెర్ (3) బౌలింగ్‌తో అదరగొట్టింది, నాట్ సివర్, ఇస్సీ వాంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Innings Break!@mipaltan restrict #RCB to 125/9 in the first innings!
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Will @RCBTweets successfully defend their total 🤔
Scorecard ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/FO5fcqUWej
రిచా లేకుంటే!
టాస్ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. భీకరమైన బ్యాటర్ సోఫీ డివైన్ (0) ఒక పరుగు వద్దే రనౌటైంది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3x4, 1x6), ఎలిస్ పెర్రీ (29) నిలకడగా ఆడారు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించారు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరును 32/1కి చేర్చారు. రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని అమెలియా కెర్ విడదీసింది. 6.4వ బంతికి స్మృతిని ఔట్ చేసింది.
Kanika Ahuja charges down the pitch but misses!
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
The #RCB batter departs for 12 as Amelia Kerr scalps her 3️⃣rd wicket of the match 🙌🏻
Follow the match ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/TgfI6k419J
వెంటవెంటనే వికెట్లు!
ఆ తర్వాత ముంబయి పట్టు బిగించింది. అస్సలు రన్స్ లీక్ చేయలేదు. ప్రమాదకర హీథర్ నైట్ (12)నూ కెర్ ఔట్ చేసింది. కనిక అహుజా (12) విఫలమైంది. దూకుడు పెంచే క్రమంలో పెర్రీని నాట్ సివర్ ఎల్బీ చేసింది. దాంతో 16.6 ఓవర్లకు ఆర్సీబీ 100 పరుగుల మైలురాయిని టచ్ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ మెరుపు బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు బోర్డును ఉరకలెత్తించింది. ఇస్సీ వాంగ్ వేసిన 19.1వ బంతిని భారీ సిక్సర్ బాదబోయి ఆమె ఔటవ్వడంతో ఆర్సీబీ 125/9కి పరిమితమైంది.
Amelia Kerr is our 🔝 performer from the first innings of the #TATAWPL match #RCBvMI
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
She got 3️⃣ important wickets that helped @mipaltan restrict #RCB to 125/9
Watch her bowling summary 🔽 pic.twitter.com/RGntxtU6PN