IND vs SA: కోహ్లీసేన లంచ్ మెనూ! చదువుతుంటూనే నోరూరుతోంది!
సెంచూరియన్‌లో రెండో రోజు టీమ్‌ఇండియా లంచ్ మెనూ ఇదేనంటూ ఓ చిత్రం వైరల్‌గా మారింది. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తుంటే వారి స్వభావం, పద్ధతులను బట్టి వంటలు చేస్తుంటారు.
భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్టు రెండో రోజు వర్షార్పణం అయింది. ఆదివారం టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడటంతో సోమవారం కోసం అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురుచూశారు. కానీ వరుణుడు తన ఆట మొదలు పెట్టడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. అయితే రెండో రోజు కోహ్లీసేనకు ఏర్పాటు చేసిన భోజనం అద్భుతంగా ఉన్నట్టుంది!
సెంచూరియన్‌లో రెండో రోజు టీమ్‌ఇండియా లంచ్ మెనూ ఇదేనంటూ ఓ చిత్రం వైరల్‌గా మారింది. దీని ప్రకారం భారత ఆటగాళ్లకు సోమవారం బ్రొకొలి సూప్, చెట్టినాడ్ చికెన్, లెంటిల్స్, ల్యాంబ్ చాప్స్, పెప్పర్ సాస్, వెజిటెబుల్ కడాయ్, పన్నీర్ టిక్కాను వడ్డించారు. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తుంటే వారి స్వభావం, పద్ధతులను బట్టి వంటలు చేస్తుంటారు. భారత్ ఎక్కడికి వెళ్లినా కోడికూరతో వెరైటీలు చేసి వడ్డిస్తుంటారు. అడిగినప్పుడు స్థానిక ఆహార పదార్థాలనూ ఇస్తారు.
Day 2 Lunch menu for team India. pic.twitter.com/lXFuVTd1oT
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2021
వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దవ్వడంతో మూడో రోజుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సెంచూరియన్‌లో వాతావరణం ఎలా ఉంది? వర్షం పడుతూనే ఉందా? ఈ రోజైనా కాస్త తెరపినిస్తుందా? కొంత ఆటైనా సాగుతుందా? జరిగితే ఎన్ని ఓవర్లు ఆట కొనసాగిస్తారు? వంటి ప్రశ్నలు భారత అభిమానుల నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే మంగళవారం ఆట కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెంచూరియన్ వాతావరణం నేడు ప్రశాంతంగా ఉంది. ఆక్యూవెదర్ వెబ్‌సైట్ ప్రకారం మంగళ, బుధవారాల్లో వర్షం కురిసే అవకాశాలు లేవు. కాబట్టి రోజుకు 98 ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగిస్తారని తెలిసింది.
తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్: 248 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం సాధించగా.. తనతోపాటు అజింక్య రహానే (40 బ్యాటింగ్: 81 బంతుల్లో, 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (60: 123 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. పుజారా డకౌట్ అయ్యాడు. కోహ్లీ (35) అర్ధశతకం చేజార్చుకున్నాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి