By: ABP Desam | Updated at : 24 Aug 2023 03:10 PM (IST)
ప్రజ్ఞానంద (ఫైల్ ఫొటో)
ప్రస్తుతం ఫిడే చెస్ వరల్డ్ షిప్ 2023 ఫైనల్ ఆడుతున్న ప్రజ్ఞానంద ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారీ ప్రైజ్‌మనీతో తిరిగి రానున్నాడు. ఈ ఫైనల్లో భాగంగా జరిగిన రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగిశాయి. దీంతో నేడు (గురువారం) టై బ్రేకర్ నిర్వహించనున్నారు. ఈ టైబ్రేకర్ ర్యాపిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. ఇందులో గెలిచిన వారు టోర్నమెంట్ విజేతగా అవతరించనున్నారు.
ఈ చెస్ వరల్డ్ కప్‌లో విజేతకు ఏకంగా 1.1 లక్షల యూఎస్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.90.9 లక్షలు) లభించనుంది. రన్నరప్‌గా నిలిచిన వారు 80 వేల డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.66.13 లక్షలు) ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఈ చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ 1.834 మిలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.15.13 కోట్లు అన్నమాట.
ఫిడే ప్రపంచ చెస్ పోటీల్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య జరిగిన మొదటి రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో టై బ్రేక్ గేమ్ అవసరం తప్పలేదు. ఇద్దరి మధ్య ఈ తుది పోరు నేడు (గురువారం) జరుగనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లో సాగే ఈ టైబ్రేక్‌లో కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద చెక్ పెట్టాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ గేమ్ మాత్రం ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతోంది. టైటిల్ కోసం మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో భారత చెస్ సంచలనం ప్రజ్ఞానంద పోటీ పడుతున్నాడు. వరుసగా రెండో గేమ్‌నూ వీరు డ్రాగా ముగించారు. అంతకు ముందు మంగళవారం జరిగిన తొలి గేమ్ కూడా ఫలితం తేలకుండా ముగిసింది. బుధవారం జరిగిన రెండో గేమ్ కూడా డ్రా అయింది. తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్ మొదటి నుంచి డ్రాను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఎత్తులు వేశాడు. నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా సైతం కార్ల్‌సన్‌కు దీటుగా పావులు కదిపాడు.
ఈ ఫైనల్ మొదటి నుంచి మాగ్నస్ కార్ల్‌సన్ పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు. సెమీస్ తర్వాత కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడ్డానని చెబుతూ మాగ్నస్ కార్ల్‌సన్ గేమ్‌ను టై బ్రేక్ వైపు తిప్పేందుకు యత్నించాడు. ఒక రోజు ఆగితే తనకు మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడవచ్చన్నది కార్ల్‌సన్ వ్యూహం. అయితే ప్రజ్ఞానంద కూడా దీన్ని పసిగట్టినట్లు ముందు నుంచే రక్షణాత్మకంగా వ్యవహరించాడు.
30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు అంగీకరించారు. రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్ ఇద్దరూ 1-1తో సమానంగా ఉన్నారు. గురువారం విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ గేమ్ నిర్వహించనున్నారు. ఈ గేమ్ పైనే అందరి దృష్టి నెలకొంది.
టై బ్రేక్ ఎలా నిర్వహిస్తారు?
ఈ ప్రపంచకప్‌ను పూర్తిగా నాకౌట్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతి రౌండ్లోనూ మొదట రెండు క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఈ గేమ్‌ల్లో విజేత ఎవరో తేలకపోతే అప్పుడు టైబ్రేక్ నిర్వహిస్తారు. ఈ విధానంలో మొదటగా ర్యాపిడ్‌లో పోటీ నిర్వహిస్తారు. రౌండ్‌కు రెండు గేమ్‌లు చొప్పున రెండు రౌండ్లు పోటీ జరుగుతుంది. మొదటి రౌండ్లోనే ఫలితం వస్తే పోటీ ఆపేసి విజేతను ప్రకటిస్తారు.
ఒకవేళ ర్యాపిడ్ రౌండ్లు ముగిసినా ఆటగాళ్ల పాయింట్లు సమానంగా ఉంటే అప్పుడు బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో రౌండ్‌కు రెండు గేముల చొప్పున ఈ బ్లిట్జ్ పోటీలు జరుగుతాయి. ఈ రెండు రౌండ్లలో కూడా ఫలితం తేలకపోతే ఎవరో ఒకరు విజేతగా నిలిచేంతవరకూ ఈ బ్లిట్జ్ గేమ్‌లు కొనసాగిస్తూనే ఉంటారు.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
IND vs AUS 3rd ODI: రోహిత్ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్ సెంచరీ - టార్గెట్ దిశగా టీమ్‌ఇండియా!
IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్ 353
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>