Virat Kohli Black Water: కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ కాస్ట్ ఎంతో తెలుసా? అవే ఎందుకు తాగుతాడు? ఇంకా ఎవరెవరు ఈ వాటర్ తాగుతారో తెలుసా...
కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘బ్లాక్ వాటర్’ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
సాధారణంగా క్రీడాకారులు ఫిట్ నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఈ క్రమంలోనే అనుష్క శర్మతో పెళ్లి తర్వాత పూర్తి శాఖాహారిగా మారినట్లు కూడా కోహ్లీ చెప్పాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే...
కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘బ్లాక్ వాటర్’ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఫిట్‌నెస్ కాపాడుకునే వాళ్లు ఈ వాటర్ తీసుకుంటున్నారు. దీని ధర తెలిసిన వాళ్లు మాత్రం నోరు మీద వేలేసుకుంటున్నారు. కోహ్లీతో పాటు కొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఈ వాటర్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ బ్లాక్ వాటర్ ఏంటి? ఎందుకు అంత ప్రత్యేకత? లీటరు బ్లాక్ వాటర్ ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.
View this post on Instagram
సాధారణంగా మనం లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే రూ.100 మించి ఉండదు. కానీ, ఈ బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ.3000-4000 ఉంటుందట. ఔను, మీరు చదివింది నిజమే. మనం తీసుకునే నీళ్లల్లో PH స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అలానే బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే శరీర బరువుని అదుపులో ఉంచుతూ డిప్రెషన్‌ని దూరం చేస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
View this post on Instagram
సాధారణ నీటికి కొన్ని రకాల మినరల్స్ కలిపి బ్లాక్ వాటర్‌ను తయారు చేస్తారు. వడోదరకు చెందిన ఒక స్టార్టప్... ఇండియాలో బ్లాక్ ఆల్కలీన్ వాటర్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ఈ మధ్య చాలా మంది సెలబ్స్ తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకోచ్చాడు. ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. ఏడాదిన్నర నుంచి కోహ్లీ ఈ బ్లాక్ వాటర్ తాగడం మొదలెట్టాడు. కోహ్లీ మాత్రమే కాదండోయ్ హీరోయిన్లు ఊర్వశి రౌటాలా, మలైకా అరోరా, శ్రుతి హాసన్ కూడా తమ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ఈ వాటర్ తాగుతున్నారట.