PV Sindhu Loses: మళ్లీ ఓడిన సింధు - ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లోనే ఇంటి బాట!
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు రెండో రౌండ్లోనే ఇంటి బాట పట్టింది.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం ముగిసింది. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన సయాకా టకహాషి చేతిలో 19-21, 21-16, 17-21 చేతిలో ఓడిపోయింది. గత కొంతకాలంగా పీవీ సింధు పేలవ ఫామ్ కొనసాగుతోంది. తను ఒక కప్ గెలిచి కూడా చాలా కాలం అవుతోంది.
గేమ్‌ను సింధు పాజిటివ్‌గానే ప్రారంభించింది. మొదట్లోనే 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే టకహాషి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి సెట్‌ను 21-19తో సొంతం చేసుకుంది.
ఇక రెండో సెట్‌లో సింధు పైచేయి సాధించింది. 11-4తో ఆధిక్యం సంపాదించిన సింధు సయాకాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 21-16తో రెండో సెట్ దక్కించుకుంది. ఇక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. 11-10తో స్వల్ప ఆధిక్యం సాధించిన సయాకా... సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తర్వాత 16-11తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లి 21-17తో సెట్‌ను, మ్యాచ్‌ను దక్కించుకుంది.
ఇక యువ భారత ఆటగాడు లక్ష్యసేన్ ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండర్స్ ఆంటోన్‌సేన్‌పై 21-16, 21-18 తేడాతో గెలుపొందారు. సైనా నెహ్వాల్ కూడా 14-21, 21-17, 17-21తో ఓటమి పాలయింది.
PV Sindhu loses to Sayaka Takahashi of Japan 19-21 21-16 17-21 in the second round of women's singles of All England Badminton Open 2022
— ANI (@ANI) March 17, 2022
(File photo) pic.twitter.com/brNP5RNANn
View this post on Instagram