By: ABP Desam | Updated at : 29 Dec 2021 03:02 PM (IST)
Edited By: RamaLakshmibai
Zodiac Signs
జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. మంచి చెడులు చూడాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు. మరికొందరు నక్షత్రం గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు ( నక్షత్రానికి సంబంధించని అక్షరంతో) పెట్టుకుంటారు. అందుకే నామ నక్షత్రం, జన్మ నక్షత్రం అంటాం. నక్షత్రం ఏంటో తెలిసిన వారికి రాశి విషయంలో, అసలు నక్షత్రమే తెలియని వారికి పేరు ఆధారంగా ఎలా తెలుసుకోవాలో అన్నది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మొత్తం 27 నక్షత్రాలు..12 రాశులు....
ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కో రాశిలో 9 పాదాలుంటాయి.
నక్షత్రం తెలిసిన వారు మీ రాశి ఏంటో ఇక్కడ చూసుకోవచ్చు...
ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా. ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా 24 గంటలు ఉంటుంది. 24 ని నాలుగు భాగాలు చేస్తే 6 గంటలు. అంటే నక్షత్రంలో మొదటి 6 గంటలు మొదటి పాదం, తర్వాతి 6 గంటలు రెండో పాదం, మూడో ఆరోగంటలు మూడోపాదం..ఆఖరి 6 గంటలు నాలుగోపాదం. మీ పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
రాశి నక్షత్రం
మేషం - అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం
వృషభం - కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మిధునం -మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కర్కాటకం - పునర్వసు నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష
సింహం -మఘ, పుబ్బ(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య -ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
తుల -చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వృశ్చికం -విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ధనస్సు -మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం -ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
కుంభం -ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మీనం -పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
నక్షత్రం తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకోవచ్చు....
అశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: ఆ/ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో/కా/కీ,
ఆరుద్ర:కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ/ హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
మఖ: మా/ మి/ మూ/మే
పూర్వ ఫల్గుణి: మో /టా/ టీ/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/టో/ పా /పీ
హస్త: వూ/షం /ణా/ ఢా
చిత్త: పే/పో/రా/రి
స్వాతి: రూ/ రే/ రో /లా
విశాఖ: తీ/తూ/తే /తో
అనూరాధ: /నా /నీ /నూ /నే
జ్యేష్ట:నో /యా /యీ/యూ
మూల: యే /యో /బా/ బీ
పూర్వాషాడ: బూ/ ధా /భా /ఢా
ఉత్తరాషాడ: బే/బో / జా / జీ
శ్రవణం: జూ/జే /జో/ ఖా
ధనిష్ట: గా/ గీ/ గూ/గే
శతభిషం: గో /సా/ సీ /సూ
పూర్వాభద్ర: సే /సో/ దా/దీ
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి: దే/దో/చా/చీ
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
Drone Shot Down: అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్ను కూల్చేసిన సైన్యం
Nepal Plane Missing: నేపాల్లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా