Worlds most sacred mountains: కైలాస పర్వతం నుంచి గోవర్ధన పర్వతం వరకు భారతదేశంలో 5 పవిత్ర పర్వతాలు ఇవి!
Most sacred mountains : ఆధ్యాత్మికతకు మారుపేరు.. భారతదేశంలో ఉన్న ఈ 5 పవిత్ర పర్వతాలు భక్తితో పాటూ శక్తికి ప్రతీకలు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..

worlds most sacred mountains: ప్రపంచంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి..ఇవి మానవుడు జయించడానికి కాదు. వాటి ఉనికి గౌరవం మరియు భక్తి భావానికి సంబంధించినవి. అలాంటి 5 పర్వతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం
కైలాస పర్వతం
కైలాస పర్వతం అత్యంత పవిత్రమైన ప్రదేశం. శివుడు ఇక్కడ నివసిస్తాడని శివపురాణం, విష్ణుపురాణంలో ఉంది. శివుని నివాసంగా భావిస్తారు. ఈ పర్వతంపై నేటి వరకు ఎవరూ ఎక్కలేదు. కైలాస పర్వతంపైకి వెళ్లడానికి బదులుగా, దాని 52 కిలోమీటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, దీనిని కోరా ఆచారం అంటారు. చైనా ఆధీన టిబెట్ ప్రాంతంలో హిమాలయ శ్రేణుల్లో ఉన్న ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,638 మీటర్లు (21,778 అడుగులు) ఎత్తులో ఉంది. హిందువులకే కాదు బౌద్ధ, జైన, బోన్ మతాల వారికి కూడా ఇది పవిత్ర ప్రదేశం. కైలాశ పర్వతాన్ని దర్శించుకుంటే శివుడి దర్శనం లభించినట్టే అని భక్తుల విశ్వాసం

గోవర్ధన్ పర్వతం
బృందావన్ లో గోవర్ధన్ పర్వతం చూడటానికి సాధారణంగా చిన్నదిగా ఉన్నప్పటికీ, దాని గొప్పతనం .. ప్రాముఖ్యత గురించి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఇంద్రుని కోపంతో బృందావనం అంతా ఆపదలో చిక్కుకున్నప్పుడు శ్రీ కృష్ణుడు తన చిన్న వేలితో దీనిని ఎత్తి ఏడు రోజుల పాటు కుండపోత రాళ్ల వర్షం నుంచి ప్రజల్ని రక్షించాడు. నేటికీ ఇక్కడికి వచ్చే యాత్రికులు చెప్పులు లేకుండా గోవర్ధన్ పర్వతానికి ప్రదక్షిణలు చేస్తారు.

త్రికూట పర్వతం
జమ్మూలోని కట్రాలో ఉన్న త్రికూట పర్వతం నేటికీ విశ్వాసం భక్తికి ఒక ఉదాహరణ. ఈ పర్వతంపై మాతా వైష్ణో దేవి సహా ఎంతో మంది దేవతలు కొలువై ఉన్నారు. మాతా వైష్ణో దేవి గుహ త్రికూట పర్వతంపై ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు 12 కిలోమీటర్ల కఠినమైన ఎత్తులో నడిచి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ మౌనంలో కూడా అమ్మవారి శక్తులను అనుభూతి చెందుతారు. మూడు శిఖరాలతో కూడినది కావడం వల్లే త్రికూట పర్వతం అంటారు. జమ్మూ నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో రియాసి జిల్లాలో కట్రా పట్టణం నుంచి ప్రారంభమయ్యే యాత్ర మార్గంలో ఉంటుంది. ఇక్కడ ఆలయం సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో సహజమైన గుహలో ఉంటుంది.దారి మొత్తం ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి

పార్వతి లోయ
హిమాచల్ ప్రదేశ్ పహాడీ ప్రాంతంలో ఉన్న పార్వతి లోయ ... ఇక్కడ శివుడు యుగాల తరబడి ధ్యానం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే సౌమ్యంగా ఉంటుంది. పార్వతి లోయ సహజ సౌందర్యం, ట్రెక్కింగ్, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి. శివుడు ఇక్కడ ధ్యానం చేశాడని పురాణ కథలు ఉన్నాయి. ఈ మధ్య పర్యాటకుల సందడి మరింత పెరిగింది కానీ..లేదంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం. ధ్యానం మెడిటేషన్ చేయడానికి ఈ ప్రదేశం చాలా ఇష్టపడతారు. ఢిల్లీ నుంచి బస్సు ద్వారా భూటాన్ చేరుకుని అక్కడి నుంచి కాసోల్ వెళ్లవచ్చు. . మార్చి, జూన్ లేదంటే సెప్టెంబర్ నవంబర్ లో ఈ ప్రాంత సందర్శనకు మంచి సమయం
అరుణాచల పర్వతం
తిరువణ్ణామలై లో ఉన్న అరుణాచల పర్వతం శివుని చిహ్నం కాదు, స్వయంగా శివుడే కొండగా వెలసిన ప్రదేశం. రమణ మహర్షి వంటి సాధువులు ఈ ప్రదేశంలో నివసించారు. నిత్యం భక్తుల సందడి ఉండే ఈ క్షేత్రంలో పౌర్ణమి రోజుల్లో ఆ సందడి మరింత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే స్వయంగా శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని భావిస్తారు భక్తులు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇక్కడ ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.





















