అన్వేషించండి

Srisailam Dhuli Darshan : శ్రీశైలంలోనే ధూళి దర్శనం ఎందుకు? ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆంతర్యం ఏంటి?

Maha Shivaratri 2026: శరీరం అసౌచం అయితేనేం ఆ భోళాశంకరుడిని దర్శించుకునేందుకు మనసులో భక్తి ఉంటే చాలు..శ్రీశైలం ధూళి దర్శనం వెనుకున్న ఆంతర్యం ఇదే..ఇంతకీ ఈ ధూళి దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

Maha Shivaratri  Srisailam Dhuli Darshan

శ్రీశైలం ధూళి దర్శనం ఎందుకు అత్యంత విశిష్టమైనది?

శ్రీశైలంలో ధూళి దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

ఇతర ఏ ఆలయంలోనూ లేనివిధంగా శ్రీశైలంలోనే ఎందుకు ధూళి దర్శనం ఉంటుంది?

ధూళి దర్శనం వెనుకున్న ఆంతర్యం ఏంటి?

శ్రీశైలం ధూళి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఇతర ఏ ఆలయంలోనూ లేని విధంగా శ్రీశైలంలోనే ధూళి దర్శనానికి అనుమతిస్తారు.  కార్తీకమాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా ఏ ఆలయంలో అయినా స్నానం లేకుండా, శుచిగా లేకుండా దర్శనానికి వెళ్లలేరు..కానీ శ్రీశైలంలో అలా కాదు.. స్నానంతో పనిలేదు..ఎంత దూరం నుంచి వెళ్లినా, శరీరం అసౌచంగా ఉన్నా...వళ్లంతా దుమ్ము ధూళి నిండి ఉన్నా అలా మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లిపోవచ్చు. నేరుగా శివిలంగాన్ని స్పర్శించి తలపెట్టి మొక్కుకోవచ్చు. ఇదే ధూళి దర్శనం అని పిలుస్తారు.
 
శ్రీశైలం మల్లన్న భక్తుల శరీర శుద్ధి, అసౌచాన్ని పరిగణలోకి తీసుకోడు..మనసు నిండా భక్తి నింపుకుని వచ్చినవారిని భక్తుడిగా అంగీకరిస్తాడు. ప్రయాణంలో ధుమ్ము, ధూళి కొట్టుకుపోయి వచ్చనా సరే తనను తాకి దర్శించుకునే అవకాశాన్నిస్తాడు. ఇది ఆయన భక్త వాత్సల్యానికి ప్రతీక
 
ధూళి దర్శనం ఎప్పటి నుంచి మొదలైంది?

అప్పటి రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పక్కనున్న కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కాలినడకన వచ్చేవారు. అంతదూరం నుంచి వచ్చిన భక్తులు ఆ కష్టాన్ని మర్చిపోయేందుకు..నేరుగా స్వామివారిని చేరుకునేందుకు మొదలైన సంప్రదాయం ఇది. ఇది భక్తి తీవ్రతను, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది
 
మల్లికార్జున జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే దగ్గర కొలువై ఉండడంతో శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేదనే నమ్మకం ఉంది. 

ధూళి దర్శనం ద్వారా స్వామివారిని స్పర్శించడం వలల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం
 
ధూళి దర్శనం శ్రీశైలంలోనే ఉండటానికి కారణం?

పరమేశ్వరుడు నివాసం ఉండేది స్మశానంలో..ఆయన శరీర శుద్ధి కన్నా మనఃశుద్ధితో ఉండేవారినే భక్తులుగా స్వీకరిస్తాడు. 
 
ఇక ఇక్కడ కొలువైన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది. దక్షయజ్ఞంలో సతీదేశి దేహత్యాగం చేసినప్పుడు ఆ శరీరాన్ని విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించంగా ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలు. శ్రీశైలంలో సతీదేవి మెడ భాగం పడిందని పురాణాల్లో ఉంది. అందుకే ఇది అత్యంత ముఖ్యమైన శక్తిపీఠంగా భావిస్తారు. శరీరానికి గొంతు ఎంత ముఖ్యమో శక్తిపీఠాల్లో శ్రీశైలానికి అంతే ప్రాధాన్యత ఉంది.

అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు భ్రమర (తేనెటీగలు) రూపంలో వచ్చి రాక్షస సంహారం చేశారు. ఆ తర్వాత భ్రమరాంబికగా వెలిశారు.  ఆలయం బయట కుడివైపు గోడకు చెవి ఆన్చితే భ్రమరగీతం ( తేనేటీగల ఝుంకారం) వినిపిస్తుందట. అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శం అంటారు భక్తులు.

చాళుక్యులు, రెడ్డిరాజులు, విష్ణు కుండినుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది..ఆ తర్వాత విజయనగర రాజులు, కృష్ణదేవరాయలు వంటి రాజులు గోపురాలు మండపాలు నిర్మించి అభివృద్ధి చేశారు. 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Happy Friendship Day 2026: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
Spiritual Energy : జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget