అన్వేషించండి

Ghost Dreams: కలలో దెయ్యాలు కనిపించడం దేనికి సంకేతం? ఏం జరుగుతుంది?

Ghost Dreams: నిద్రలో వచ్చే కొన్ని భయంకరమైన కలలు మనల్ని కలవరపెడతాయి. దెయ్యాలు,ఆత్మలు వెంటాడుతున్నట్లు మానసికంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి కలలనుంచి దూరం చేసేందుకు ఆధ్యాత్మికత మనకు సహాయపడుతుంది.

Ghost Dreams: నిద్రలో కలలు రావడం సాధారణమైన విషయం. కొన్ని కలలు ఊహించని విధంగా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మరికొన్ని డ్రీమ్స్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. మన పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ లేదా వారిని దెయ్యం రూపంలో  చూడటం దేనికి సంకేతం. కలలో దెయ్యాలను చూడటమేనది మానసిక అనారోగ్యానికి ముడిపడిన అంశంగానే భావిస్తారా? కలలో ఆత్మలు, దెయ్యాలను మన నుంచి దూరం చేసేందుకు ఆధ్యాత్మికత ఎలా తోడ్పడుతుందనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

చెడు శకునానికి సంకేతం:

కలలో ఆత్మ లేదా దెయ్యంతో మాట్లాడటం అశుభంగా భావిస్తుంటాము. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో దెయ్యాలు కనిపించడం అనేది మంచిది కాదు. దెయ్యాలు నెగెటివ్ ఎనర్జీకి చిహ్నాలు. ఇవి చెడు శకునానికి సంకేతం. భావోద్వేగానికి గురైన సమయంలో వచ్చే కలల్లోనే దెయ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. నిద్రలో తరచుగా దెయ్యాలు కనిపిస్తే మానసికంగా బలహీనపడుతున్నామని అర్థం. అలాగే కలలో దెయ్యాలు కనిపిస్తే మీరు మరణం గురించి ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పవచ్చు.

గతంలో చేసిన తప్పుల కారణంగా:

మీరు గతంలో చేసిన తప్పులు లేదా అబద్దాల గురించి పశ్చాత్తాపపడుతున్పప్పుడు ఇలాంటి కలలు రావొచ్చు. మీకు జరిగిన అవమానాలు, భయకంరమైన గాయాలను తలచుకున్నప్పుడు ఈ కలలు వేధిస్తుంటాయి. మీ ఆత్మలు సైతం దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించి, భయానక వాతావరణంలోకి నెట్టేస్తాయి. కొన్నిసార్లు దెయ్యం కలలు మీరు గతాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైందనే సందేశాన్ని తెలియజేస్తాయి. ఇతరులతో గొడవలు, ఆందోళనకు సంబంధించి అవసరమైన దిద్దుబాట్లు చేపట్టి వారితో రాజీపడేలా ప్రేరేపిస్తాయి. అయితే మీరు గతంలో చేసిన తప్పులు, పశ్చాతాపాలను ఎంత త్వరగా వదిలేస్తే అంత వేగంగా మీ కలల్లోంచి ఆత్మలు అదృశ్యమవుతాయి.

సన్నిహిత వ్యక్తిని కోల్పోయినపుడు:

నిరంతరం మనతో సంబంధాల్లో ఉండే సన్నిహితులను కోల్పోయినపుడు రాత్రుళ్లు తలచుకుని ఆందోళనపడుతుంటాం. అయితే ఆ ఆలోచనలకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేయడానికి దెయ్యం కలలను సంకేతాలుగా భావించవొచ్చు. మీరు మానసికంగానే కాదు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని మీకు అర్థం చేయించి అందులోనుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికత మీకు సహాయపడుతుంది. 

భవిష్యత్తుకు ప్రమాదమే:

మీరు నిరంతరం ఏదో కోల్పోయిన భావనలో ఉంటే మీ భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని కలలుగంటున్నట్లయితే మీరు చేసే పనిమీద సరిగా దృష్టి కేంద్రీకరించట్లేదని అర్థం. అందుకే మీకు దిశానిర్దేశం చేసే ఆలోచనలు చేయడం వల్ల ఈ దెయ్యం కలలనుంచి బయటపడతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget