News
News
X

Weekly Horoscope: ఈ రాశులవారి స్థిరాస్తులు,వాహనం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి 25 జూలై నుంచి 31 జూలై 2022 వరకు వార ఫలాలు

Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

వారఫలాలు జులై 25 సోమవారం నుంచి 31 ఆదివారం వరకు( Weekly Rasi Phalalu)

మేషం 
ఈ వారం మేషరాశివారు ఆర్థిక సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని వివాదాలు వెంటాడతాయి.నూతన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలించవు. వ్యాపారాల్లో పెద్దగా మార్పులుండవు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది. 

వృషభం 
ఈ వారం మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. స్నేహితుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. 

మిథునం
ఈ వారం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించండి. మీ మాటతీరుతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు. ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు చూసుకోండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్థిరాస్తులు,వాహనం కొనుగోలు చేయాలనుకునే ప్రయత్నాలు కలిసొస్తాయి. 

Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి

కర్కాటకం 
వృత్తి, వ్యాపారం, ఉద్యోగులకు ప్రోత్సాహకర సమయం ఇది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఓ సమస్య నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు శుభసమయం. ఆస్తిని వృద్ధి చేయాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం 
పెద్దల ఆశీర్వచనంతో ఓ పని పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చెడు వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 

కన్య 
కన్యా రాశివారు ఈ వారం మొత్తం సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు జరిపించేందుకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. 

Also Read: రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

తుల
మీ పరిధి దాటి ప్రయత్నించకండి. ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.  ఆరోగ్యం జాగ్రత్త.కుటుంబ సభ్యుల సహకారంతో చేసే పనులు పూర్తవుతాయి.

వృశ్చికం 
మీకు మంచి సమయం నడుస్తోంది. సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరమ మర్యాదలుంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది. అందరనీ కలుపుకుని ముందుకెళ్లండి...

ధనుస్సు
ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి పనులు పూర్తిచేయలేరు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ సమస్యకి పరిష్కార మార్గం కనుక్కుంటారు. వ్యాపారాల్లో లాభాలొస్తాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

మకరం
కీలకమైన పనులు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసొస్తాయి. రాజకీయ వర్గాలవారికి మంచి సమయం. ఉద్యోగులకు సమస్యలు తొలిగిపోతాయి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు.

Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు

కుంభం 
మీ పనితీరుతో గుర్తింపు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండుసాక్లు ఆలోచించండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులను వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 

మీనం 
ఉన్నతమైన ఆలోచనా విధానంలో లక్ష్యాలు చేరుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి తొలగిపోతుంది. మిమ్మల్ని తప్పుతోవ పట్టించేవారున్నారు అప్రమత్తంగా వ్యవహరించండి. 

Published at : 25 Jul 2022 06:04 AM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs July 2022 Monthly Horoscope astrological prediction Weekly Rasi Phalalu july 25th to 31st 2022

సంబంధిత కథనాలు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

టాప్ స్టోరీస్

Breaking News Telugu Live Updates: తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు 

Breaking News Telugu Live Updates: తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు 

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌