Jupiter Retrograde 2022 : రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
Jupiter Retrograde: గ్రహాల వక్రగమనం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలిస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలిస్తుంది. దేవగురువైన బృహస్పతి తిరోగమనం ఈ రాశులవారికి ప్రతికూల ఫలితాలనిస్తుంది...
బృహస్పతి తిరోగమనం ( Jupiter Retrograde 2022 )
నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.శని గ్రహం అంటే ఎంత భయమో..గురు గ్రహం శుభస్థానంలో లేకపోయినా అంతేభయం. ఎందుకంటే చదువు, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి గురుబలం ఉండాల్సిందే. కొన్ని సందర్భాల్లో శని నీచ స్థానంలో ఉన్నప్పటికీ గురుబలం ఉంటే తీవ్రత తగ్గుతుందంటారు జ్యోతిష్యులు. జూలై 28న దేవగురువైన బృహస్పతి మీనంలో తిరోగమనం ప్రారంభమవుతుంది.ఈ తిరోగమన స్థితి నవంబరు 27 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి అన్నీ ప్రతికూల పరిస్థితులే...
మేషం
జ్ఞాన కారకుడైన బృహస్పతి మీ రాశి నుంచి 11వ స్థానంలో సంచరించడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి.
Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి
తులా
తులా రాశికి అధిపతి శుక్రుడు. బృహస్పతికి శుక్రుడు శత్రువుగా పరిగణిస్తారు. అందుకే గురు గ్రహం సంచారం ఈ రాశివారికి ఎంతమాత్రం లాభించదు. ఈ సమయంలో శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. మానసిక అశాంతి నెలకొంటుంది. మీ వ్యక్తిగత విషయాలు అందరితోనూ పంచుకోవడం మానేయండి. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
ధనస్సు
బృహస్పతి తిరోగమనం ధనస్సు రాశివారికి కూడా మంచి జరగదు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవు. మనశ్సాంతి ఉండదు. కుటుంబంలో అనవసర తగాదాలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంకండి.
Also Read: ద్రౌపది గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
మకరం
గురుగ్రహం వక్రగమనం వల్ల ఈ రాశివారికి తలపెట్టిన ప్రతిపనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బు కోల్పోతారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొద్దు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.
మీనం
మీన రాశివారికి కూడా గురు గ్రహ తిరోగమనం కలసిరాదు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు, అనవసర ఖర్చులు తప్పవు. ప్రతి అడుగులోనూ ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపడం వల్ల కొంతవరకూ ఒత్తిడి తగ్గుతుంది. శుభకార్యాల పర్యటన చేస్తారు.
Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
Note: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…