Jupiter Retrograde 2022 Astrogoly: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి
గ్రహాల వక్రగమనం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలిస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలిస్తుంది. దేవగురువైన బృహస్పతి ఈ నెల 28 నుంచి వక్రంలో ప్రయాణించనున్నాడు. ఈ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉందంటే..
బృహస్పతి తిరోగమనం( Jupiter Retrograde 2022 )
నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.శని గ్రహం అంటే ఎంత భయమో..గురు గ్రహం శుభస్థానంలో లేకపోయినా అంతేభయం. ఎందుకంటే చదువు, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి గురుబలం ఉండాల్సిందే. కొన్ని సందర్భాల్లో శని నీచ స్థానంలో ఉన్నప్పటికీ గురుబలం ఉంటే తీవ్రత తగ్గుతుందంటారు జ్యోతిష్యులు. జూలై 28న దేవగురువైన బృహస్పతి మీనంలో తిరోగమనం ప్రారంభమవుతుంది.ఈ తిరోగమన స్థితి నవంబరు 27 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి అత్యంత యోగదాయకమైన సమయం
వృషభం
బృహస్పతి వృషభ రాశివారికి 11 వ ఇంట తిరోగమనంలో ఉండడం వల్ల ఆర్థికంగా మీకు కలిసొచ్చే సమయం ఇది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి, ఉద్యోగులకు పదోన్నతులు లేదా జీతం పెరుగుదల ఉంటుంది. మీ పనితీరు మునుపటి కన్నా మెరుగుపడడంతో ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల వారికి బాగా కలిసొస్తుంది.
Also Read: రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
మిథునం
మిథున రాశివారికి గురుగ్రహం తిరోగమనం 10వ ఇంట ఉంటుంది. ఈ సందర్భంగా మీ పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. మాట తూలొద్దు.
కర్కాటకం
గురు గ్రహం తిరోగమనం కర్కాటక రాశివారికి కూడా కలిసొస్తుంది.ఆర్థిక పరిస్థితి అధ్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ధీమాగా ఉన్నా లాభాలు వచ్చి పడతాయి. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము కూడా చేతికందుతుంది.
సింహం
బృహస్పతి వక్రగమనం సింహరాశివారికి ఆకస్మిక ధనలాభాలను తెచ్చిపెడుతుంది. ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. పెండింగ్ లో ఉన్న మొత్తం వసూలవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
వృశ్చికం
గురుగ్రహం సంచారం ఈ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగులకు అనుకోని ఆదాయం వచ్చిపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
మకరం
ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగి చేతిలో ధనం స్థిరంగా ఉంటుంది. ఇతర ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నంచి ఆర్థిక సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.
కుంభం
బృహస్పతి మీనంలో తిరోగమనం చెందడంతో కుంభరాశి వారికి రెండో స్థానంలో ఉన్నట్టు లెక్క.ఈ ప్రభావంతో ఈ రాశివారికి లక్కు కలిసొస్తుంది. ఉద్యోగులు,వ్యాపారులు, విద్యార్థులు, వృత్తుల వారికి మంచి సమయం. ధనం సంపాదించడానికి, ఆదా చేయడానికి ఇదే మంచి సమయం.
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి