అన్వేషించండి

Weekly Horoscope 9 May to 15 May 2022: ఈ రాశివారు ఈ వారం ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు, ఈ వారం మీ రాశిఫలితం తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మే 09 సోమవారం నుంచి మే 15 ఆదివారం వరకూ వార ఫలాలు

మేషం
ఈ వారం మీరు ఇంటి పనులతో చాలా బిజీగా ఉంటారు. మీ లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలను మరిచిపోవద్దు. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తుల ద్వారా మీ పనులు కొన్ని చేయించుకుంటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. సృజనాత్మక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వారాంతం మీకు చాలా బాగుంటుంది. శుక్రవారం తర్వాత పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీరు ప్రయాణాల నుంచి ప్రయోజనం పొందుతారు. సహోద్యోగులతో, పై అధికారులతో వాగ్వాదానికి దిగకండి. మీరు తీసుకున్న నిర్ణయం గురించి బాధపడాల్సి ఉంటుంది. 

వృషభం 
ఈ వారం కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.  బుధుడు తిరోగమనంలో ఉన్నందున, మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వర్తించే ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమ జంటలకు సమయం అనుకూలం. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. శ్రేయోభిలాషులను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వారం ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా చురుకుగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గొంతుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం 
విద్యార్థులు తమ చదువుల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది.  ఫీల్డ్‌లో ముందుకు సాగడానికి మంచి సమయం ఇది.  వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. వారం ఆరంభం మీకు శుభప్రదంగా ఉంటుంది.  అధికారులతో సమన్వయం సరిగా ఉండదు. కోపంతో స్పందించకండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందడంలో ఇబ్బంది ఉంటుంది.

Also Read: ఈ ఫలం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టేనట

కర్కాటకం 
ఉద్యోగస్తులు తమ పనిలో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ప్లాన్ చేస్తారు. దినచర్య చాలా సమతుల్యంగా ఉంటుంది. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. మీరు షేర్ మార్కెట్ నుంచి లాభం పొందుతారు. ఈ వారం కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. పని పట్ల మీ ఉత్సాహాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యుల అంచనాలకు విరుద్ధంగా పనులు చేయడం వల్ల వాగ్వాదాలు తలెత్తుతాయి. ప్రత్యర్థుల ప్రవర్తనపై నిఘా ఉంచండి.

సింహం 
భౌతిక సుఖాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ వారం బావుంటుంది. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. పనిలో బిజీగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉంటారు.  మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారం మొత్తం ఉత్సాహంగా ఉంటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పనులు మీ ప్రకారమే జరిగినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.  సీజనల్ ఫ్రూట్స్, నీటిని ఎక్కువగా తీసుకోవాలి.  మీ మాటల విషయంలో మొండిగా ఉండకుండా ఉండండి.

కన్య 
మీ మనోబలం పెరుగుతుంది. ఇంటికి అతిథులు వస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. మీ జీతం పెరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏదైనా సామాజిక సంస్థకు విరాళం ఇవ్వొచ్చు.  మీ వ్యక్తిగత సౌలభ్యం కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. ముఖ్యమైన వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంటి పెద్దల అసంతృప్తిగి గురవుతారు. అతి విశ్వాసం వల్ల నష్టం జరుగుతుంది.

తుల
మత గ్రంధాలను అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం ప్రారంభం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం వినోద సాధనాలు సమకూరుతాయి. లక్ష్యం వైపు దృష్టి సారిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీరు ఇంటి లోపలి భాగంలో కొన్ని మార్పులు చేస్తారు.  మీరు ప్రత్యర్థులను ఓడించగలరు. మీ ప్రేమను ప్రపోజ్ చేసేందుకు ఈ వారం అనుకూలంగా లేదు. కార్యాలయంలో ఇబ్బందులు ఉంటాయి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు.

Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది

వృశ్చికం 
మీరు పిల్లల ప్రవర్తన నుంచి ఆనందాన్ని పొందుతారు. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. మీ స్వభావంలో వినయం ఉంటుంది. మీ పనిని మెచ్చుకుంటారు. కీళ్ల నొప్పులు, కండరాల ఒత్తిడి ఉంటుంది.  తల్లిదండ్రుల సుఖాలు , ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. యువత తమ కెరీర్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో కొంత గందరగోళం ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. 

ధనుస్సు 
ఈ వారం తీర్థయాత్ర ఆలోచన చేస్తారు. మీ సంకల్పం కారణంగా పెద్ద విజయాలు పొందుతారు. మీరు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం మొత్తం చాలా శుభప్రదంగా ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ వారం లాభం పొందుతారు.  లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. తాజా ఆహారం తినండి. ప్రతికూల ఆలోచనల కారణంగా మీ మనస్సు కృంగిపోయి ఉంటుంది.

మకరం
వ్యాపారస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. యువత తమ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్ల మీ పని పూర్తవుతుంది. మీరు సామాజిక సంస్థల్లో చేరుతారు.  వారం ప్రారంభం మీకు మంచిది కాదు. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మంచి ప్రవర్తనను కొనసాగించండి. మొండి వైఖరిని విడిచిపెట్టండి.

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

కుంభం 
ప్రత్యర్థులతో వివాదాలను అధిగమిస్తారు. మీరు సామాజిక సేవలో విజయం సాధిస్తారు. బంధువు గురించి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు లాభపడగలరు. పిల్లల విజయాలతో సంతోషిస్తారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త మానుకోవాలి. తెలియని అడ్డంకి పనిపై ప్రభావం చూపుతుంది.  యువత కెరీర్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది.

మీనం 
నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. విద్యార్థులకు ఇది చాలా శుభప్రదం. పాపులారిటీ పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ మనస్సు ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉంటుంది. బంధువులతో మీ సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. అనియంత్రిత ఆహారాన్ని నియంత్రించాలి. రక్తపోటు పెరగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. మీరు దినచర్యను మార్చుకోవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget