Sri Lakshmi Phalam: ఈ ఫలం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టేనట
సీతాఫలం, రామాఫలం విన్నారు కదా..మరి శ్రీ లక్ష్మీఫలం గురించి తెలుసా. ఈ ఫలం ఎక్కడ దొరుకుతుంది, ఎలా పూజంచాలి, దీనివల్ల ఉపయోగాలేంటో చూద్దాం...
శ్రీలక్ష్మీ ఫలం గురించి చాలామందికి తెలియదేమో...ఇది చూడడానికి సేమ్ టు సేమ్ కొబ్బరికాయ లా ఉంటుంది. రంగు మాత్రం బూడిద రంగు. పెద్ద ఉసిరికాయ సైజులో ఉండే శ్రీ లక్ష్మీ ఫలానికి కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు, కళ్లు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం సేకరించి, ఇంట్లో ఉంచుకుంటే సాక్షాత్తూ పాలసముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకున్నట్టే అంటారు. అమ్మవారు సాగరం నుంచి ఉద్భవించినట్టే..ఈ ఫలాలు కూడా సాగరతీరంలోనే దొరుకుతాయట.జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. దీన్నే లఘు నారికేళం అని కూడ అంటారు. తీర ప్రాంతాల్లో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాల నుంచి ఈ ఫలాలు ఉద్భవిస్తాయి.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది
ఈ పండుని దొరికిందే తడువగా తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేయరు. దానికి కూడా మంచి రోజు చూసుకోవాలి. గురువారం, శుక్రవారం కానీ ఏదైనా పర్వదినం రోజుకానీ తీసుకొచ్చి దేవుడి దగ్గర ఉంచి పూజించాలి. పూజచేయడానికి ముందు ఫలాన్ని శుద్ధి చేసి పూజకు కేటాయించిన పీటను శుభ్రంచేసి పసుపురాసి బొట్టు పెట్టి దానిపై కొత్త వస్త్రం పరిచి శ్రీలక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. చందనం, కుంకుమ బొట్టు పెట్టి...కొన్ని నాణాలు, అక్షింతలు, కొద్దిగా పసుపు, కుంకుమ దీని ముందుంచాలి. "ఓం శ్రీం శ్రియై నమః" అనే మంత్రాని పఠించడంతో పాటూ లక్ష్మీ అష్టకం, అష్టోత్తరం చదువుతూ పుసుపు, కుంకుమతో పూజించాలి.ఈ ఫలం ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు చోటుండదని పండితులు చెబుతారు.
శ్రీలక్ష్మీ ఫలం పూజించడం వల్ల ఉపయోగాలు
- శ్రీలక్ష్మీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఉపయోగపడుతుంది
- శ్రీ లక్ష్మీ ఫలాన్ని నిత్యం పూజించే వారింట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వృధాఖర్చులుండవు
- ఈ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచితే సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.
- వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచితే పంటలు బాగా పండుతాయి
- శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎప్పుడూ నాణేలు ఉంచాలి
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం