Vivasvat Saptami 2022: ఈ రోజు వివస్వత సప్తమి, సూర్యుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం
ఆషాడ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజు వివస్వత సప్తమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 6 బుధవారం వచ్చింది. ఈ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజించాలని సూచిస్తున్నారు పండితులు...ఈ తిథి ప్రత్యేకత ఏంటంటే..
వివస్వత సప్తమి (జూన్ 07 బుధవారం)
సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు. ఈ రోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఏడు సంఖ్యకు సూర్యుడికి విశేషమైన సంబంధం ఉంది. సూర్య భగవానుని జన్మ తిథి సప్తమి. రథానికి ఉండే గుర్రాల సంఖ్య ఏడు, కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి, తన శక్తిని ప్రసరించగలిగేవాడే వివస్వానుడు అని అంటారు. శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక సూర్యుడికి వివస్వతుడనే పేరు కూడా ఉంది. ఆషాడ మాసం శుక్ల పక్షం సప్తమిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున పగటి సమయంతో , రాత్రి సమయం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయని చెబుతారు.
వివస్వత సప్తమి గురించి పురాణ కథనం
వివస్వత మను సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ఒకప్పుడు సత్యవ్రతుడు అనే దయగల రాజు ఉండేవాడు. ఓ రోజు ఆయన నది ఒడ్డున తర్పణాలు వదులుతుండగా అకస్మాత్తుగా ఒక చేప చేతిలోకి వచ్చింది. ఆ చేపను నదిలో వదిలేసేందుకు ప్రయత్నించగా...వదిలేయొద్దు రాజా అని కోరింది ఆ చేప. దానిని తన కమండలంలో ఉంచి తన భవనానికి తీసుకొచ్చాడు. కమండలంలో స్థలం సరిపోవడం లేదని ప్లేస్ మార్చమని కోరింది. మట్టి కుండ, నీటి తొట్టె, సరస్సు ఇలా ఎక్కడ ఉంచినా ఆ చేప ఆ స్థలాన్ని అధిగమించేది. చివరికి సముద్రంలో వేయగా సముద్రాన్ని కూడా అధిగమించింది.
Also Read: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
ఇది సాధారణ చేపకాదని భావించిన సత్యవ్రతుడు నమస్కరించి..." నేను ఇప్పటి వరకూ ఇలాంటి జీవిని చూడలేదు మీరు ఎవరో చెప్పండి అని కోరాడు". అప్పుడు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తాను చేపరూపంలో అవతరించానని చెప్పి... ఈ రోజు నుంచి ఏడు రోజుల తర్వాత మూడు ప్రపంచాలు నీటిలో మునిగిపోతాయిఆ సమయంలో పెద్ద పడవ వస్తుంది, మీరు, దేవతలు , వృక్షాలు, జంతువులు, జీవులన్నీ ఆ పడవ ఎక్కండి.వాసుకి పాముని ఉపయోగించి ఆ పడవను నా కొమ్ముకి కట్టండి అని చెబుతాడు. అలా ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను సత్యవ్రతుడికి అప్పగిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ సత్యవ్రతుడే వైవస్వత మనుగా పిలుస్తారు. సూర్యుడి కుమారుడు వైవస్వత మను కూడా మనుస్మృతి సృష్టికర్త.
వైవస్వత మనువు పాలనా విధానంలో, దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు గంధర్వులు అనే 5 వర్గాలు ఉండేవి. వైవస్వత మనువుకి పది మంది కొడుకులు. ఇక్ష్వాకు, కుషణం, అరిష్ట, దృష్ట, నరిష్యంత, కరుష, మహాబలి, శర్యాతి పృషధరుడు. ఇందులో ఇక్ష్వాకు వంశం విస్తృతమైంది. శ్రీరామచంద్రుడు ఈ వంశానికి చెందినవాడే.
Also Read: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
వివస్వత సప్తమి రోజు ఏం చేయాలి
వివస్వత సప్తమి రోజు సూర్యుడిని పూజించడం వల్ల జీవతకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు , ఈతిబాధల నుంచి బయటపడేందుకు , సానుకూల ఫలితాలు పొందేందుకు సూర్యుడిని ఆరాధించాలి. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కొనేవారు, ఆస్తి సంబంధిత ఇబ్బందుల్లో ఉండేవారు సూర్యుడిని ఆరాధిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది
- సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి
- స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి
- అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగిపాత్రలో నీటిని నింపి, ఎర్రచందనం రాసి, అక్షింతలు , ఎర్రటి పూలు నీటిలో విడిచిపెట్టాలి
- ఈ రోజు తీపి ఆహార పదార్థాలు మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి, తినాలి
- ఆదిత్య హృదయ స్తోత్రం , సూర్యష్టకం చదవడం చాలా మంచిది
- సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు, 'ఓం రవయే నమః' అనే మంత్రాన్ని పఠించండి
- ఈ రోజు రాగి పాత్రలు, బెల్లం, ఎర్రచందనం, వస్త్రం, గోధుమలను దానం చేయడం శుభప్రదం
నోట్: కొందరు పండితులు ఇచ్చిన సమాచారం, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
Also Read: Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి