Vinayaka chavithi 2023: ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు
వినాయక చవితి వేళ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లంబోదరుడు దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆకాంక్షించారు..
నేడు వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది మూర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. లంబోదరుడు దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... శాంతి, సౌభ్రతృత్వం వెలివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ... ప్రజలంతా ఐకమత్యం, ఆనందంతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.దేశ ప్రజలపై వినాయకుడి ఆశీర్వాదం ఉండాలని కోరారు. ప్రజలంతా ఈ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
గణపతి బప్పా మోరియా... విగ్నేశ్వర ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి, కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండగ వినాయక చవితి. ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు, ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం జగన్ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. ' క్షేమ, ధైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని కోరుకున్నారు. విజ్ఞలని తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు' అని ఆకాంక్షిస్తూ పెట్టారు వేదికగా శుభకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.... వినాయక చవితి హిందువులకు పవిత్రమైన అండగాని పేర్కొన్నారు. రాష్ట్రంలో గణనాథుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ పండగను ఐక్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి పండగను ఎక్కువ సంఖ్యలో జరుపుకుంటూ ఉండడంతో పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు.
సకల విద్యలకు కొలువైన గణన అధిపతి ప్రతి ఒక్కరి జీవితాల్లో అవాంతరాలు తొలగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశం వినాయక చవితి పండగలో ఉందన్న ఆయన ఈ పండగ రోజు మట్టి లేదా పసుపుతో చేసిన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
'దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సకల విద్యలకు కొలువైన గణపతి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆరోగ్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నా' అంటూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహిళ ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడు కొలువుదీరుతున్న వీడియోను షేర్ చేసిన ఆయన... 'గణనాథుడి బలం మన వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నా' అని రాస్కొచ్చారు. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా' అంటూ వీరేంద్ర సింహం ట్వీట్ చేశారు.