Vijayeswara Swami Temple: శివుడితో యుద్ధం చేసిన అర్జునుడు, ఈ మహిమన్విత ప్రదేశంలో ఏం కోరుకున్నా విజయం తథ్యం
విజయుడు నడయాడిన నేల,పరమశివుడి గురించి పార్థుడు ఘోర తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం. ఇంద్రకీలాద్రి అనగానే దుర్గమ్మ కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో ఆలయం ఉందక్కడ
విజయేశ్వరాలయం (Vijayeswara Swami Temple)
విజయవాడలో ఆధ్యాత్మిక ప్రదేశం అనగానే అందరకీ కళ్లముందు కనిపించే రూపం ఆ జగన్మాత , ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. అయితే ఆ ఆలయ దక్షిణ భాగంలో స్వయంగా అర్జునుడు స్వహస్తాలతో ప్రతిష్ఠించి పూజించిన శివాలయం ఎంత విశిష్ఠమైనదో తెలుసా. వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యం విజయేశ్వర ఆలయం.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
విజయేశ్వరాలయ స్థల పురాణం
ధర్మరాజు ఇంద్రుడి దగ్గర ఉన్న అస్రాలను తీసుకురమ్మని చెప్పగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడిని అస్త్రాలు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అర్జునుడితో...నువ్వు శివుడిని ప్రసన్నం చేసుకోగలితే ఆ అస్త్రాలు నీకు లభిస్తాయంటాడు. ఇంద్రుడు చెప్పిన మాట ప్రకారం ఇంద్రకీలాద్రి పర్వతం చేసుకున్న అర్జునుడు పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలని భావించి తానె స్వయంగా ఒక కిరాతకుడిగా మారి త్రిశూలాన్ని విల్లుగా మార్చుకుని మారువేషంలో వస్తాడు. మూకాసురుడిని పంది రూపంలో అర్జునుడి దగ్గరికి పంపగా, మూకాసురుడు అర్జునుడి తపస్సుని భంగం కలిగించడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది. తపో భంగం కలగడంతో ఆగ్రహించిన అర్జునుడు పంది రూపంలో ఉన్న మూకాసురుడి పై బాణాలు వేస్తాడు. ఆ సమయంలోనే కిరాతకుడు రూపంలో ఉన్న శివుడు కూడా మూకాసురిడిపైన బాణాలు వేస్తాడు. మూకాసురుడు చనిపోవడంతో... తాను చంపానంటే తాను చంపానంటూ ఇద్దరూ వాదనకు దిగుతారు. ఆ వాదన యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా బోయవాడికి ఏమీ అవదు. అయినప్పటీ ఓటమిని అంగీకరించని అర్జునుడు పోరాటానికి ముల్లోకాలు కంపించిపోతుంటాయి. అదే సమయంలో తన ఎదురుగా ఉన్నది బోయవాడు కాదు శివుడు అని తెలుసుకుంటాడు అర్జునుడు. అప్పుడు పార్వతీసమేతంగా పరమేశ్వరుడు సాక్షాత్కారం ఇచ్చి...అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని బహూకరించాడు శివుడు.
Also Read: శ్రావణ భార్గవిని వివాదంలోకి నెట్టిన ఈ కీర్తన అసలు సందర్భం, అర్థం తెలుసా!
శంకరుడి నిజరూపాన్ని చూసిన అర్జునుడు అదే ప్రదేశంలో ఓ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం పొంది విజయం సాధించడంతో ఈ ప్రాంతం విజయవాటికగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా విజయవాడగా మారింది. అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో విజయేశ్వరుడిగా ఇక్కడి స్వామి భక్తులతో పూజలందుకొంటున్నాడు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్న విజయం సిద్ధిస్తుందని పండితులు చెప్పడమే కాదు, భక్తుల విశ్వాసం కూడా...
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!