Venu Swamy: జగన్ స్లో అవుతారు, పవన్ మరో పెళ్లి చేసుకుంటారు: వేణు స్వామి కామెంట్స్
ఏపీ రాజకీయాలపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ కనుమరుగవుతుందని వెల్లడించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిన నేపథ్యంలో రిజల్ట్స్ ఆసక్తికరంగా ఉంటాయన్నారు.
![Venu Swamy: జగన్ స్లో అవుతారు, పవన్ మరో పెళ్లి చేసుకుంటారు: వేణు స్వామి కామెంట్స్ Venu Swamy predicts Andhra Pradesh Elections 2024 Results and AP CM Venu Swamy: జగన్ స్లో అవుతారు, పవన్ మరో పెళ్లి చేసుకుంటారు: వేణు స్వామి కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/feea47c5ccb207aa67309239175a37581717241767250239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Venu Swamy About AP Politics: ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి ఏపీ రాజకీయాల గురించి చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏకంగా ఓ పార్టీ కనుమరుగవుతోందని వెల్లడించారు. 2024లో ఏపీ సీఎం ఎవరు? అనే విషయంపైనా ఆయన సంచనల వ్యాఖ్యలు చేశారు. “2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఒక పార్టీ ఉండదు. ఏ పార్టీ అనేది నేను చెప్పను. కానీ, నేను పెద్ద పార్టీ అంతరించిపోతుంది. జాతీయ పార్టీలు అనేవి పోతుంటాయి. వస్తుంటాయి” అని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డియే మళ్లీ ఏపీ సీఎం- వేణు స్వామి
ఏపీలో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది జగన్ మోహన్ రెడ్డియేనని వేణు స్వామి వెల్లడించారు. “నేను ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పాను. మళ్లీ చెప్తున్నాను.. 2024లో ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవుతాడు. జాతక ప్రకారం ఆయనకే యోగం ఉంది. చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రం. పవన్ కల్యాణ్ ది ఉత్తరాషాడ నక్షత్రం. జగన్ మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి జనవరి 16, 2023 నుంచి అష్టమన శని మొదలయ్యింది. రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. పవన్ కల్యాణ్ కు 2017లోనే ఏలిన నాటి శని మొదలయ్యింది. 2025 జులై వరకు ఈ ప్రభావం ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డికి శని మంచి స్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టి ఆయన సీఎం అవుతాడని అర్థం చేసుకోవచ్చు.
బీజేపీతో కలిస్తే ఫలితాల్లో మార్పులు - వేణు స్వామి
ఏపీలో జగన్ స్పీడ్ కు బ్రేక్ వేయాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటైతే సాధ్యం అవుతుందని చెప్పారు. “టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే జగన్ మోహన్ రెడ్డి స్లో అవుతారు. చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఎన్నికల్లోకి వెళ్లి పోటీ చేసి గెలిచి సీఎం అయ్యే యోగం లేదు. పవన్ కల్యాణ్ జాతకం కూడా బాగా లేదు. కనీసం బీజేపీ కలిస్తే ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ పాజిటివ్ నెస్ చంద్రబాబుకు ఉపయోగపడే అవకాశం ఉంది. 2024లో పవన్ కల్యాణ్ సీఎం అయ్యే యోగం 100కు 1000 శాతం లేదు” అని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కు మరో పెళ్లి
ఇక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వేణు స్వామి తెలిపారు. “జాతకం ప్రకారం పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లిళ్లు అనేవి ఆయన వ్యక్తిగత విషయం. ఆయన ఇష్టం. ఒక పెళ్లి చేసుకున్నందుకే మనం చాలా కష్టపడుతున్నాం. ఆయన మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడంటే ఆయనకు దండం పెట్టాల్సిందే. మరో 10 ఏళ్ల తర్వాత భారత్ లో కూడా పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తారు. సహజీవనం లాంటి కాన్సెప్ట్ ఎప్పుడో మొదలయ్యింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి.
Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)