Vastu Tips in Telugu: ఈ ‘వాస్తు’ వస్తువులను కానుకగా ఇవ్వొచ్చా? ఇస్తే ఏమవుతుంది.. మేలు జరుగుతుందా, కీడా?
పెళ్లయినా.. పుట్టిన రోజైనా.. ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాం. వెంటనే ఏ లాఫింగ్ బుద్ధా బొమ్మో.. రాధాకృష్ణుల ఫొటో ఫ్రేమ్ లేదా విగ్రహాన్నో కానుకగా ఇస్తాం. మరి, అలాంటి బహుమతులు ఇవ్వొచ్చా?
పుట్టిన రోజు నుంచి పెళ్లి వేడుకల వరకు. ఏ ఫంక్షన్ జరిగిన.. బహుమతులు తప్పనిసరి. కొందరు డబ్బులు చదివిస్తే.. మరికొందరు వస్తువులు, బొమ్మలను గిఫ్టులుగా ఇస్తుంటారు. ఇటీవల వాస్తుకు సంబంధించిన చాలా వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటిని ఇతరులకు గిఫ్టుగా ఇవ్వొచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వారి కోసమే ఈ సమాచారం.
‘వాస్తు’ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా?
ఈ విషయంలో ఎలాంటి సందేహం వద్దని వాస్తు నిపుణులు అంటున్నారు. వాటిని బహుమతిగా ఇవ్వడం వల్ల అనుబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెబుతున్నారు. ఈ బహుమతులు మీ అనుబంధంలో కొత్త అందాలను తీసుకువస్తాయట. వాస్తుకు సంబంధించిన వస్తువులు బహుమతులుగా లభించడాన్ని చాలామంది అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి సంపదను, సమృద్ధిని, అదృష్టాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తాయి. తీసుకున్న వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇచ్చిన వారికి తృప్తిని మిగులుస్తాయి.
ప్రేమ పక్షులు
ప్రేయసి ప్రియులు ఒకరికొకరు ప్రేమపక్షులను బహుమతిగా ఇచ్చుకుంటే అపార్థాలు తొలగిపోతాయి. వారి అనుబంధం మరింత తియ్యగా మారుతుంది. ఈ పక్షులను నైరుతి దిక్కున అలంకరించుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
లాఫింగ్ బుద్ధ
కూర్చుని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ప్రేమకు, ప్రశాంతతకు ప్రతీక. ఇది మనశ్శాంతిని అందిస్తుంది. కనుక ఈ సారి లాఫింగ్ బుద్ధను మీ బహుకరించండి. జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
గోల్డెన్ ఫోటో ప్రేములు
చతురస్రకారం లేదా దీర్ఘచతురస్రకారంలో ఉండే బంగారు రంగు ఫోటో ఫ్రేములు జీవితానికి ఒక స్థిరత్వాన్ని అందిస్తాయి. మీ జంట ఫోటోలు అమర్చిన ఇటువంటి ఫోటో ప్రేములను బహుకరించవచ్చు.
రోజ్ క్వార్ట్జ్
గులాబి రంగు స్పటికం ప్రేమకు ప్రతీక. ఇది ప్రేమ పూరితమైన వైబ్రేషన్ కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిగత భావావేశాలను అదుపు చేస్తుంది. సహనుభూతిని పెంపొందించి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
రాధాకృష్ణుల విగ్రహం
రాధారాణి, శ్రీకృష్ణుడు కలిసి ఉన్న విగ్రహం ఎల్లలెరుగని ప్రేమకు ప్రతీక. రాధాకృష్ణుల ఫోటో ప్రేమ్ కావచ్చు లేదా విగ్రహం కావచ్చు.. మీరు ప్రేమించే వ్యక్తికి బహుకరించవచ్చు. ఇది మీరు అందించే ఎల్లలెరుగని ప్రేమకు నిదర్శనంగా చెప్పవచ్చు.
బహుమతులు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినపుడు ఎలాంటి వస్తువు ఇవ్వాలా అనే డైలమా అందరికీ వస్తుంది. ఇలాంటి సమయంలో కొంచెం సమయస్ఫూర్తిని ఉపయోగించి మీ ప్రేమను ప్రతిబింబించే ఈ పవిత్రమైన వస్తువులను బహుకరించి మీ ప్రియతముల మనసు గెలుచుకోవచ్చు. చూశారుగా.. ఈ సారి ఎలాంటి సందేహం లేకుండా ఈ గిఫ్టులను కొనుగోలు చేయండి.
Also Read : Gifts for newly wed couple: కొత్తగా పెళ్లయిన వారికి ఇవి బహుకరిస్తే.. వారి జీవితం ఆనందంగా సాగుతుంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.