Vastu Tips for Car: ఎవండోయ్.. కారుకు ఉంటాయ్ వాస్తు నియమాలు, ఇవి తప్పకుండా పాటించాలి.. లేకపోతే ప్రమాదమే
Vastu Tips: ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. ఇంట్లోని విషయంలోనూ వాస్తు నియమాలను పాటిస్తాం. ఇళ్లు మాత్రమే కాదు..వాహనాల పార్కింగ్ విషయంలో వాస్తు చిట్కాలు పాటించాలని చెబుతున్నారు పండితులు.
Vastu Tips: హిందువులు వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా ఇల్లుకు సంబంధించి పక్కగా పాటిస్తారు. ఇంటికి స్థలం చూసింది మొదలు ఇంట్లో చెప్పుల స్టాండ్ వరకు ప్రతీది వాస్తు ప్రకారం ఉండాలని భావిస్తారు. అయితే ఇంట్లో వస్తువులు పెట్టుకునేందుకు వాస్తు ఏవిధంగా అయితే ఉంటుందో..అదే విధంగా వాహనాలు పార్కింగ్ కు కూడా వస్తు నియమాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది కార్లు వాడుతున్నారు. అయితే, కార్లకు, కారు పార్కింగ్‌కు కూడా వాస్తు చిట్కాలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా కారును పార్క్ చేసేందుకు కొన్ని వాస్తు చిట్కాలు తెలుసుకోవాలి. ఇంటి డిజైన్, అలంకరణలో వాస్తు నియమాలు పాటిస్తారు. కానీ కారు పార్కింగ్ విషయంలో అంతగా వాస్తు గురించి పట్టించుకోరు. తప్పుడు దిశలో కారు పార్కింగ్ చేసినట్లయితే సమస్యలు తప్పవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన దిశలో కారు పార్కింగ్ చేస్తే బోలెడు లాభాలు ఉంటాయి.
కారు పార్కింగ్, గ్యారేజ్ వాస్తు చిట్కాలు:
మీ కారుకు మంచి అదృష్టాన్ని అందించేందుకు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
వాస్తు ప్రకారం గ్యారేజ్ స్థలం:
మీ ఇంట్లోని వాహనాలు, కార్లు, బైకులతోపాటు ఇతర నిర్జీవ వస్తువులు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచకూడదని వాస్తు సూత్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ దిశలు ఈ వస్తువులకు అనువైనవి కాదు. అందుకే మీ వాహనాలకు సానుకూల శక్తిని అందించేందుకు మీరు కారును దక్షిణం లైదా నైరుతి దిశలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఇంటి పక్కన గ్యారేజీ:
వాస్తు ప్రకారం మీ ఇంటికి, గ్యారేజీకి మధ్య ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండాలి. రెండూ కూడా ఆనుకుని ఉండకూడదు. వాస్తు ప్రకారం గ్యాప్ లేకపోతే శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. మీ ఇంట్లో సానుకూల శక్తి నిరంతర ప్రవాహాన్ని ఉంచేందుకు ఈ రెండింటి మధ్య ఖాళీ స్థలం ఉంచేలా చూడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గ్యారేజీకి సరైన రంగు:
మీ గ్యారేజీకి సరైన రంగులో పెయింటింగ్ వేయించడం చాలా ముఖ్యం. నీలం, పసుపు, తెలుపు రంగులు మీ గ్యారేజీకి మంచివని శాస్త్రం చెబుతోంది. ఎరుపు, నలుపు వంటి ముదురు రంగులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ప్రకాశవంతమైన రంగులు సానుకూల శక్తిని ప్రసరిస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు స్పష్టమైన ఫోకస్ అందించడంలో సహాయపడతాయి.
గ్యారేజీ పరిమాణం:
మీ కారు గ్యారేజీలో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. గ్యారేజీలో కనీసం రెండు నుంచి మూడు అడుగులు నడించేందుకు వీలుగా స్థలం కారుకు ఇరువైపులా వదిలిపెట్టాలి. గ్యారేజీ చిన్నగా కాకుండా పెద్దగా, విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా అయితే ప్రతికూల శక్తి, నివారించడం సులభం.
గ్యారేజీ ప్రవేశద్వారం:
గ్యారేజీలో మా కారు డోర్ తీయడానికి ఉత్తరం లేదా తూర్పు దిశ సరైందని వాస్తు చెబుతోంది. గ్యారేజీ మరింత అనుకూలంగా నైరుతి దిశలో కూడా ఉండవచ్చు. కానీ కారు డోర్లు ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు వైపు మాత్రమే తెరిచేలా చూసుకోవాలి.
కారు పార్కింగ్ చేసేందుకు సరైన దిశ:
మీ వాహనాలను పార్కింగ్ చేసేందుకు దక్షిణ దిశగా పార్కింగ్ చేయకూడదు.ఈ దిశ అగ్నిప్రమాదం పెంచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీ కారులో ఉన్న చెడు శక్తిని, ప్రమాదాన్ని నివారించేందుకు కారుకు పూజ చేయడం చాలా ముఖ్యం, గురువారం పూజలు చేయడం మరింత ప్రయోజనకరం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.