అన్వేషించండి

ఆఫీస్ డెస్క్ మీద ఈ వస్తువులను అసలు పెట్టకూడదు - ఎందుకంటే?

పనిచేసే ప్రదేశం ముఖ్యంగా ఆఫీస్ డెస్క్ మీద కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. అందుకే ఆఫీస్ లో డెస్క్ అలంకరణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వాస్తు చెబుతోంది.

ఆఫీస్ అంటే మీకు డబ్బు సంపాదించి పెట్టే చోటని అర్థం. అందుకే work is worship అనే నానుడి ఏర్పడింది. పనిలోనే దైవం ఉన్నదని అర్థం. పనిచేసుకునే డెస్క్ చాలా పవిత్రమైంది. అది మీకు సంపదను, కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రదేశం. జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చే ప్రదేశం. అందుకే వాస్తు శాస్త్రం ఈ ప్రదేశాన్ని నెగెటివిటికి దూరంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. పాజిటివ్ గా ఉంచుకోవడం వల్ల పనిలో మరింత సామర్థ్యాన్ని చూపగలిగే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని శాస్త్రం చెబుతోంది. పనిచేసుకునే ప్రదేశం పరిసరాలు శుభ్రంగా ఉండాలి. చెత్త చేరకుండా చూసుకోవాలని వాస్తు సూచిస్తోంది. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.

పనిచేసుకునే డెస్క్ శుభ్రంగా, ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఇలా శుభ్రమైన డెస్క్ దగ్గర కూర్చున్నపుడు పనిమీద ఏకాగ్రత కుదురుతుంది. త్వరగా లక్ష్యాలను చేధించగలుగుతారు. వాస్తు ప్రభావం జయాపజయాల మీద తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆఫీస్ ఎంట్రెన్స్  వైపు వీపు ఉండేలా ఎన్నటికీ కూర్చోకూడదట. ఇది మీ పనిమీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట.

ఆఫీసు కోసం కొన్ని వాస్తు చిట్కాలు

లక్కీ బాంబూ

వాస్తులో వెదురు మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎదురులేని ఎదుగుదలకు సూచికగా ఉండే లక్కీ బాంబూ మొక్కను పనిచేసుకునే టెబుల్ మీద ఉంచుకుంటే సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు మీరు పనిచేసేందుకు ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉన్నారనేందుకు సూచన కూడా.

టేబుల్ క్లాక్

పనిచేసుకునే డెస్క్ మీద తప్పకుండా ఒక గడియారాన్ని పెట్టుకోవాలి. డెస్క్ మీద దీనిని ఎడమ వైపు పెట్టకోవాలి. ఇది సమయం చూసుకునేందుకు అనువుగా మాత్రమే కాదు జీవితంలోకి పాజిటివిటిని, క్లారిటీని తెస్తుంది.

స్టేషనరీ

ఒక నోట్ బుక్, పెన్ తప్పకుండా పని చేసే డెస్క్ మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వాస్తులో చాలా ముఖ్యమైందిగా చెబుతున్నారు. ఇది ఆలోచనల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. జీవితంలో ప్రతి విషయంలో ఒక క్లారిటిని ఇస్తుంది. ఇవి కూడా టెబుల్ మీద ఎడమవైపునే పెట్టుకోవాలి.

కుబేర

కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అంటే ఏపని చేసినా అది డబ్బు సంపాదించేందుకే అనేది నిర్వివాదాంశం. అందుకే కుబేర విగ్రహాన్ని పనిచేసే డెస్క్ మీద తప్పకుండా పెట్టుకోవాలి. ఇత్తడి విగ్రహం అయితే మరీ మంచిది. ఇది ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది.

గ్లోబ్

డెస్క్ మీద గ్లోబ్ పెట్టుకుంటే ఇది నిరంతర అభివృద్ధికి నిదర్శనంగా ఉంటుంది. గ్లోబ్ ఎప్పుడూ టేబుల్ మీద కుడివైపును అమర్చుకోవాలి. ఇలా చేస్తే అవకాశాలు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి.

ఇవి వద్దు

ఎప్పుడూ పనిచేసుకునే డెస్క్ శుభ్రంగా ఉండాలి. వాస్తు లాప్ టాప్, దాని చార్జర్ టెబుల్ మీద ఎప్పుడూ పెట్టి ఉంచుకోవద్దని చెబుతోంది. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తుంది. మీరు కూర్చునే టేబుల్ వెనుక తప్పకుండా గోడ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది మీరు దృఢంగా, స్థిరంగా ఉండటాన్ని సూచిస్తుంది. మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నట్టయితే పనిచేసుకునే టెబుల్ ను డైనింగ్ టేబుల్ గా, కిచెన్ టెబుల్ గా అసలు వాడకూడదు. ఇది కేవలం పని చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని గుర్తుపెట్టుకోవాలి.

Also Read : Ghee Diya: ఇంట్లో నేతి దీపం వెలిగిస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి


ఆఫీస్ డెస్క్ మీద ఈ వస్తువులను అసలు పెట్టకూడదు - ఎందుకంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News; రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు ? 
రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు ? 
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
Billionaires in India: అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News; రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు ? 
రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు ? 
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
Billionaires in India: అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్‌ 1 ఎవరో తెలుసా?
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Karnataka : హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Embed widget