Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే సంపదకు లోటుండదు
జీవితం ఆనందంగా గడిపేందుకు అవసరమయ్యే అన్ని పరిహారాలు వాస్తు శాస్త్రంలో వివరంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంట్లో ఈ విధంగా అలంకరించుకుంటే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.
వాస్తు నియమాలను అనుసరిస్తే సమృద్ధి, సంపదకు లోటు ఎన్నటికీ ఏర్పడదని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. ఇవి ఇంటిని సమృద్ధిగా ఉంచుతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇల్లు సౌకర్యంగా, అందంగా అన్ని ఎమినిటీస్ తో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ అనుకున్నట్టు జీవితం నడుస్తున్నట్టు అనిపించదు. ఎంతో అంకితభావంతో, కష్టపడి పనిచేస్తున్నా కావల్సినవి సమకూర్చుకోవడం కష్టతరం అవుతుంటుంది. కొన్ని వాస్తు కారణాలతో ఇలా జరుగుతూ ఉండొచ్చు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఇవి ఇంట్లో ఉంటే ఆర్థికపరమైన అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి.
మట్టి కుండ
ఇంట్లో తూర్పువైపున మట్టి కుండ లేదా తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి. ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద, ఆనందం వెల్లివిరుస్తాయి.
తులసి మొక్క
ఇంట్లో ఉత్తరంలో తులసి మొక్క నాటుకుంటే ఇంట్లోకి వచ్చే సంపదకు ఆటంకాలు ఏర్పడవు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిలిచి ఉంటుంది. ఇంట్లో తులసి మొక్కను నాటి, దానికి నిరంతరం సంప్రదాయబద్ధంగా పూజలు జరుగుతూ ఉంటే ఫలితం ఉంటుంది.
లోహపు తాబేలు
ఇంట్లో లోహపు తాబేలు బొమ్మ ఉత్తరం వైపు ముఖం చేసి ఉండేలా అమర్చుకోవాలి. ఇలా అమర్చిన తాబేలు ఇంట్లోకి సంపద, సమృద్ధి, సంతోషాన్ని తెస్తుందని వాస్తు చెబుతోంది.
నారింజ మొక్క
ఇంట్లో నారింజ మొక్క ఉండడం వల్ల సంపదతో పాటు సంతోషం కూడా వస్తుందట.
గుర్రపు డెక్క
నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇది ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది.
లోహపు చేప
ఇంట్లో లోహపు చేప ప్రతిమ ఉంటే అదృష్టం కలిసి వస్తుందట. ఆర్థిక లోటు లేకుండా ఉండేందుకు ఈ లోహపు చేప ప్రతిమ తోడ్పడుతుంది. ఇది ఇంట్లో సంతోషాలు నిలిచి ఉండేందుకు తోడ్పడుతుంది.
లక్ష్మీదేవి ప్రతిమ
లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉత్తరం వైపు చూసే ఉండే విధంగా అమర్చుకోవాలి. పద్మంలో ఆసీనురాలై ఉన్న లక్ష్మీ విగ్రహం నుంచి బంగారు నాణేలు వర్షిస్తూ ఉండే భంగిమలో ఉంటే మరీ మంచిది. ఇది అవకాశాలను అందిస్తుంది, సంపదను, సంతోషాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తోంది.
క్రిస్టల్ బాల్స్
మెరుపులీనుతున్న క్రిస్టల్ బాల్స్ ఇంటి కిటికిలో లేదా ముఖద్వారానికి వేలాడదీయ్యడం ద్వారా ఇంట్లోకి సంపద వెల్లువలా వస్తుందని వాస్తు చెబుతోంది.
పిరమిడ్
రాగితో లేదా ఇత్తడి లేదా వెండితో చేసిన పిరమిడ్ ఇంట్లో ఉండే భవిష్యత్తు బంగారు మయం చేస్తుందట. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చునే చోట ఈ పిరమిడ్ ఏర్పాటు చేసుకోవడం మరింత మేలుచేస్తుంది. పిరమిడ్ ఉన్నంత కాలం ఇంట్లో ఆనందం, సంపద నిలిచి ఉంటాయని వాస్తు చెబుతోంది. చిన్న చిన్న వస్తువుల్లో ఇలా పెద్ద ప్రయోజనాలు దాగి ఉన్నాయని వాస్తు వివరిస్తోంది.
Also Read : Ghee Diya: ఇంట్లో నేతి దీపం వెలిగిస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి