Vastu Tips: మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉన్నాయా? వెంటనే తీసేయండి.. లేదంటే ఆర్థిక కష్టాలు తప్పవు
Vastu Tips in telugu: ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటే అది మంచిది కాదు. ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలే ఉంటాయి. డబ్బు నిలవదు. మరి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. కొందరు డబ్బు సంపాదించలేక నానా కష్టాలు పడుతుంటారు. మరికొందరు మాత్రం ఎంత డబ్బు సంపాదించినా పేదవారిగానే మిగిలిపోతారు. నెల తిరిగే సరికి చేతలో చిల్లిగవ్వ కూడా మిగలక ఇబ్బంది పడుతారు. దీనికి వాస్తు దోషం కూడా ఒక కారణమేనని చెప్పవచ్చు. అందుకే ఈ విషయంలో చిన్న పొరపాటు చేసినా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొవల్సి వస్తుంది. మన ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను ఉంచుతుంటాం. అయితే వీటిలో కొన్ని వాస్తు దోషాలకు కారణం అవుతాయని మీకు తెలుసా? అప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆ వస్తువులను ఇంట్లోనుంచి బయటకు విసిరివేయాలి. మీ విజయానికి అడ్డుగా ఇంట్లో ఉంచకూడని ఆ 5 వస్తువులు ఏంటో ఇప్పుడూ చూద్దాం.
ఇంట్లో ఉంచకూడని 5 దురదృష్టకర వస్తువులు ఇవే:
1. పాత క్యాలెండర్:
మీరు ఇంట్లో ఉండకూడని అశుభకరమైన వాటిలో పాత క్యాలెండర్ ఒకటి. మీ ఇంట్లో పాత క్యాలెండర్ ఉంటే దురదృష్టం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది చెడు శక్తిని ఆకర్షించి ప్రతికూలతను కలిగిస్తుంది. ఈ రెండూ మీ జీవితంలో దురదృష్టాన్ని తెస్తాయి. కాబట్టి పాత క్యాలెండర్ ను ఇంట్లో నుంచి తొలగించి కొత్త క్యాలెండర్ ను ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ ఏడాది క్యాలెండర్‌ను ఉంచడం వలన మీరు వృత్తిపరంగా ముందుకు సాగడానికి, ఆర్థిక విజయాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుంది.
2. విరిగిన/ఆగిపోయిన గడియారాలు:
ఆగిపోయిన లేదా విరిగిన గడియారాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. కాలంతో పాటు ప్రతిదీ మారుతుందనే అవగాహన చాలా ముఖ్యం. మీ ఇంట్లో ఆగిపోయిన లేదా పగిలిపోయిన గడియారాన్ని ఉంచడం దురదృష్టాన్ని, సమస్యలను ఆహ్వానిస్తుంది. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే విరిగిన గడియారాన్ని మీతో తీసుకెళ్లడం వల్ల మీ కొత్త నివాసంలోకి దురదృష్టాన్ని ఆహ్వానించినట్లవుతుంది.
3. రాకింగ్ కుర్చీ :
కొంతమంది రాకింగ్ కుర్చీలు దురదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. ఇంట్లో రాకింగ్ కుర్చీ ఉంటే దురదృష్టం లేదా ఆర్థిక నష్టాలను తెస్తుందనే నమ్ముతారు. రాకింగ్ కుర్చీలు ముందుకు వెనుకకు కదలుతుంటాయి. ఇది చెడు శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుందని నమ్ముతుంటారు.
4. మీ బెడ్ కింద వస్తువులను ఉంచడం:
మీ మంచం కింద ఎలాంటి వస్తువులను ఉంచకూడదు. ఇది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను మంచం క్రింద ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది. ఇది చెడు శక్తిని కూడా ఆకర్షించడంతోపాటు శక్తి స్తబ్దతకు కారణం కావచ్చు. అందువల్ల, మీరు మీ మంచం కింద ఎలాంటి వస్తువులను కూడా ఉంచకూడదు. మీరు పుస్తకాలు, బట్టలు, చెప్పులు శక్తిని అడ్డుకునే వస్తువులను మీ మంచం పక్కన ఉంచకూడదు.
5. చనిపోయిన, వాడిపోయిన మొక్కలు :
మీరు ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడని దురదృష్టకరమైన వాటిలో చనిపోయిన లేదా పొడి మొక్కలు కూడా ఉన్నాయి. వాస్తు ప్రకారం, ఒక మొక్క వాడిపోవడం లేదా ఎండిపోవడం అది జీవించి ఉన్నప్పుడు కలిగి ఉన్న సానుకూల శక్తిని తొలగిస్తుంది. అందువల్ల, ఎండిన లేదా చనిపోయిన మొక్కను ఇంట్లో ఉంచడం దురదృష్టకరం. ఈ మొక్కలు కూడా ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు. మీకు వీలైనంత త్వరగా వాటిని తీసేయడం మంచిది. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచడం మంచిది. అది మీ ఇంటికి అదృష్టాన్ని, ఆహ్లాదకరమైన శక్తిని తీసుకువస్తుంది.
Also Read : ఈ రాశుల వారికి అసూయ ఎక్కువట - ఇతరుల సక్సెస్‌ను ఓర్చుకోలేరట!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.