అన్వేషించండి

ఈ రాశుల వారికి అసూయ ఎక్కువట - ఇతరుల సక్సెస్‌ను ఓర్చుకోలేరట!

కొంతమందిలో ఓర్వలేనితనం ఉంటుంది. ఇతరుల సక్సెస్‌ను జీర్ణించుకోలేరు. ముఖ్యంగా ఈ రాశులవారిలో అలాంటి లక్షణాలు ఉంటాయట. అయితే.. ఇది అందరికీ వర్తిస్తుందనే రూల్ లేదు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది.

జ్యోతిష్యం.. జన్మ నక్షత్రాలు రాశులను అనుసరించి వారి మనస్తత్వాలను తెలియజేస్తుంది. కొన్ని రాశుల్లో జన్మించిన వారికి స్వతహాగానే కొంచెం అసూయ ఎక్కువగా ఉంటుందట. ఇతరుల విజయాలను పెద్దగా ఆనందించరట. మరి వారెవరో తెలుసుకుందాం.

క్రోధం, అసూయ, ద్వేషం వంటి నెగెటివ్ ఎమోషన్స్ కొందరిలో ఎక్కువ. ఇతరుల విజయాలను, ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఈర్ష్యా ద్వేషాలు మాయా మోహాలుగా శాస్త్రం భావిస్తుంది. వీటిని జయించడం వల్ల జీవితంలో శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి. ఇలాంటి అసూయ కలిగి ఉండటానికి వారి గ్రహస్థితులు కారణమని జ్యోతిష్యం భావిస్తుంది. కొన్ని రాశుల్లో జన్మించిన వారికి అసూయ పాళ్లు ఎక్కువని శాస్త్రం చెబుతోంది. అలాంటి 5 రాశుల గురించి ఇక్కడ వివరిస్తున్నారు.

ఈ 5 రాశుల వారికి ఈర్ష్య ఎక్కువ

సింహ రాశి

సింహరాశి వారు అటెన్షన్ కోరుకునే మనుషులు. గుంపులో ఉన్నపుడు వారికే ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఇతరుల విజయాలు వారికి అసూయ కలిగిస్తాయి. సింహరాశి వారు తప్పకుండా వారి ఈ రకమైన ఎనర్జీని తమ విజయాల కోసం వినియోగించడం అవసరం.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి సునిశితమైన అంతఃదృష్టి ఉంటుంది. వీరు చాలా మంచి పరిశోధకులు. వీరి ఈ లక్షణమే వారిలో ఈర్ష్యకు కారణమవుతుంది. కొన్ని సార్లు విజయం కోసం వారు ఎంచుకున్న మార్గాల్లో ఇతరులు కూడా విజయం సాధించడం వారిలో అసూయ కలిగించవచ్చు.

మేష రాశి

మేషరాశి వారికి పోటితత్వం ఎక్కువ. ఎవరైనా వారిని మించి ఎదగడాన్ని పెద్దగా సహించలేరు. వీరి ఈ లక్షణం వీరిలో అసూయకు కారణం అవుతుంది. జీవితంలో గెలుపోటములు సాధారణమనే ఒక అవగాహన కలిగించుకుంటే ఈ నెగెటివ్ ఫీలింగ్ నుంచి త్వరగానే బయటపడగలుగుతారు.

వృషభ రాశి

వృషభ రాశిలో పుట్టిన వారు సురక్షితంగా ఉండడం, ఐహిక సుఖాల పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. వీరు ఇతరులు ఈ సౌకర్యాలు, సౌఖ్యాలు కలిగి ఉండడాన్ని గమనించినపుడు అసూయకు గురవుతారు. కానీ వారి వ్యక్తిగత విజయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తే దీని నుంచి త్వరగానే బయట పడగలుగుతారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా సురక్షిత భావన, భావావేశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎమోసనల్ గా లేదా మెటిరియలిస్టిక్ గా కానీ తమకంటే మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తే వారు అసూయకు గువుతారు. ఈ బావనాత్మక విషయాల మీద వీరు కొద్దిగా దృష్టి సారిస్తే ఈ నెగెటివ్ ఫీలింగ్ నుంచి బయటపడడం సులభమే వీరికి.

Also Read : వెండి ఆభరణాలు ధరిస్తే అదృష్టం వరిస్తుందా? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Kanguva Release Trailer: కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
కంగువ రిలీజ్ ట్రైలర్... సూర్య అస్సలు తగ్గట్లేదుగా - హిట్టు కళ కనపడుతుంది రోయ్
iPhone 15 Sales: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
Embed widget